Sachin Tendulkar: సఫారీ ఫేసర్లను ఎదుర్కోవడానికి సచిన్ సలహా ఇదే

: ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా ఫేసర్లను ఎదుర్కోవడానికి విలువైన సలహాలిచ్చారు. ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఫ్రంట్ ఫూట్ డిఫెన్స్ పాటించాలంటూ సూచించారు.

Sachin Tendulkar: సఫారీ ఫేసర్లను ఎదుర్కోవడానికి సచిన్ సలహా ఇదే

Sachin Tendulkar

Updated On : December 23, 2021 / 12:13 PM IST

Sachin Tendulkar: ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా ఫేసర్లను ఎదుర్కోవడానికి విలువైన సలహాలిచ్చారు. ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఫ్రంట్ ఫూట్ డిఫెన్స్ పాటించాలంటూ సూచించారు. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా టీమిండియా ఆదివారం తొలి టెస్టు మొదలుపెట్టనుంది. కగిసో రబాడా, లుంగీ ఎంగిడీలను ఎదుర్కొనేందుకు ఫ్రంట్ ఫూట్ తప్పదని అన్నారు.

‘నేనెప్పుడూ చెప్తుంటా.. ఫ్రంట్ ఫూట్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. ముందుకొచ్చి ఫ్రంట్ ఫూట్ తీసుకోవడం చాలా కీలకం. తొలి 25ఓవర్లు అలా డిఫెన్స్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సచిన్ సూచించారు.

ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ ల పార్టనర్ షిప్ మాదిరిగా ఆడాలా అని అడిగినప్రశ్నకు రెస్పాండ్ అయిన సచిన్.. ‘ఇంగ్లాండ్ లో అదే చూశాం. రోహిత్, రాహుల్ లు కలిసి పరుగులు రాబట్టారు. సందర్భానుసారంగా ఆడారు పరవాలేదు. ప్రతి బ్యాట్స్ మన్ బాదాలనే అనుకుంటాడు. బౌలర్లు వికెట్లు తీయాలనే అనుకుంటారు. మీ చేతులు ముందుకు కదిలేటప్పుడు కచ్చితంగా బంతిని హ్యాండిల్ చేయగలం అనుకున్నప్పుడే చేయాలి’ అని చెప్పారు సచిన్.

……………………………….. : ప్రతిరోజు పెసలు తింటే బరువు తగ్గొచ్చా?..

రోహిత్ శర్మ కాలి కండరం కారణంగా టెస్టు మ్యాచ్ కు గైర్హాజరీ అవుతుండటంతో అతని స్థానంలో ప్రియాంక్ పంచాల్ జట్టులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ తో పాటు మరో ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ టెస్టును ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.