సెమిస్ లోకి అడుగుపెట్టిన సైనా నెహ్వాల్

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 01:29 PM IST
సెమిస్ లోకి అడుగుపెట్టిన సైనా నెహ్వాల్

ఇండోనేషియా మాస్టర్స్ బీబడ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ సత్తా చాటింది. శుక్రవారం(జనవరి 25,2019) జరిగినక్వార్టర్ ఫైనల్స్ లో   థాయ్ లాండ్ కి చెందిన   పోర్న్ పావి చోచువాంగ్ ని 21-7, 21-18 తేడాతో ఓడించి 2019లో వరుసగా రెండో సెమీ ఫైనల్ లోకి  సైనా నెహ్వాల్ అడుగుపెట్టింది. అయితే కిదాంబి శ్రీకాంత్ మాత్రం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి వెనుదిరిగాడు. ఇద్దరు చైనా షట్లర్లు హీ బింజియావో, చెన్ షియాషిన్ ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన హీ బింజియావోతో సైనా సెమిస్ లో తలపడనుంది.