Sandeep Sharma : వేలంలో వ‌ద్దు పొమ్మ‌న్నారు.. రిప్లేస్‌మెంట్‌గా వ‌చ్చాడు.. గాయ‌ప‌డ్డాడు.. క‌ట్ చేస్తే ..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ సందీప్ శ‌ర్మ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Sandeep Sharma : వేలంలో వ‌ద్దు పొమ్మ‌న్నారు.. రిప్లేస్‌మెంట్‌గా వ‌చ్చాడు.. గాయ‌ప‌డ్డాడు.. క‌ట్ చేస్తే ..

pic credit @ RR

Sandeep Sharma five wicket haul : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ సందీప్ శ‌ర్మ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటా బౌలింగ్‌లో కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. గాయం నుంచి కోలుకుని వ‌చ్చిన సందీప్ శ‌ర్మ‌కు ఈ సీజ‌న్‌లో ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం.

మ్యాచ్ అనంత‌రం త‌న ప్ర‌ద‌ర్శ‌న పై 30 ఏళ్ల సందీప్ శ‌ర్మ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. త‌న జ‌ట్టు విజ‌యంలో తాను కీల‌క పాత్ర‌ను పోషించినందుకు సంతోషంగా ఉంద‌న్నాడు. వేరియేషన్స్, కట్టర్‌లను వేస్తూ ప‌క్కాగా త‌న ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసిన‌ట్లుగా వెల్ల‌డించాడు.

T20 World Cup 2024 : టీమ్ఇండియా టీ20ప్ర‌పంచ‌క‌ప్ ప్రొమో చూశారా..? గూస్‌ బంప్స్ రావ‌డం ప‌క్కా!

కాగా.. రెండేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో సందీప్ శ‌ర్మ అమ్ముడుపోలేదు. అత‌డిని సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆస‌క్తి చూప‌లేదు. ఆ స‌మ‌యంలో తాను ఎంతో బాధ‌ప‌డిన‌ట్లు చెప్పాడు. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ఓ ఆట‌గాడికి రిప్లేస్‌మెంట్‌గా 2023 ఐపీఎల్ సీజ‌న్ మ‌ధ్య‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో చేరాడు. కాగా.. గాయం కార‌ణంగా ఈ సీజ‌న్‌లో ఆరంభ మ్యాచుల‌ను ఆడ‌లేదు.

పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో ముంబై మ్యాచ్‌లో బ‌రిలోకి దిగాడు. త‌న అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ప్ర‌మాద‌క‌ర‌మైన సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌, టిమ్ డేవిడ్‌, ఇషాన్ కిష‌న్‌ల‌తో పాటు గెరాల్డ్ కోయెట్జీల‌ను ఔట్ చేశాడు.

Virat Kohli : బ్రేకింగ్‌.. విరాట్ కోహ్లికి బిగ్ షాకిచ్చిన‌ బీసీసీఐ..

చాలా రోజుల మొద‌టి మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తే వ‌చ్చే కిక్ వేరు అని అన్నాడు. పిచ్ నెమ్మ‌దిగా ఉండ‌డంతో బౌలింగ్‌లో వేరియేష‌న్ల‌తో పాటు క‌ట్ట‌ర్‌ల‌ను వేయాల‌నే త‌న ప్ర‌ణాళిక‌ల‌ను అనుగుణంగా బంతుల‌ను వేసి స‌క్సెస్ సాధించిన‌ట్లు వెల్ల‌డించాడు. రెండేళ్ల క్రితం వేలంలో అమ్ముడుపోక‌పోవ‌డంతో.. అప్ప‌టి నుంచి ఆడే ప్ర‌తి మ్యాచ్‌ను బోన‌స్‌గా భావిస్తూ ఆస్వాదిస్తున్న‌ట్లు  చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేరా (49) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ ఐదు వికెట్ల‌తో ముంబై ప‌త‌నాన్ని శాసించ‌గా ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.

అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ (104నాటౌట్‌) అజేయ మెరుపు సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో రాజ‌స్థాన్ 18.4 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. జైస్వాల్ మెరుపు సెంచ‌రీ కార‌ణంగా సందీప్ శ‌ర్మ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న తెర‌మ‌రుగున ప‌డింది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌లో మార్పుల‌కు బీసీసీఐ క‌స‌ర‌త్తులు..?