Team India : పాపం సర్ఫరాజ్ ఖాన్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ.. కిందపడి మరీ నవ్విన రిషబ్ పంత్.. వీడియో
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.

Sarfaraz Unorthodox Fielding Leaves Kohli In Splits Pant Reaction Goes Viral
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా.. ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పట్టుకున్న విధానం చూసి విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్‌లు నవ్వుకున్నారు.
Rafael Nadal : ముగిసిన రఫెల్ నాదల్ శకం.. ఓటమితో టెన్నిస్‌కు వీడ్కోలు..
స్లిప్ కార్డన్ వద్ద విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లు ఫీల్డింగ్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ తన ముఖానికి దగ్గరగా క్యాచ్ అందుకున్నాడు. అతడి క్యాచ్ అందుకున్న విధానం చూసి కోహ్లీ, ధ్రువ్ జురెల్ లు నవ్వుకున్నారు. రిషబ్ పంత్ అయితే.. కిందపడి మరీ నవ్వుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కాగా.. ఆస్ట్రేలియాలో కోహ్లీకి గొప్ప రికార్డు ఉంది. కోహ్లి 2011 నుండి ఆస్ట్రేలియాలో 13 టెస్టులు ఆడాడు. 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు, ఇందులో ఆరు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 169. అయితే.. కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. చివరి ఆరు టెస్టుల్లో 22.72 సగటుతో కేవలం 70 పరుగులు మాత్రమే చేశాడు. తనకు అచ్చొచ్చిన ఆసీస్ మైదానంలో ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Sachin Tendulkar : భార్య అంజలి, కూతురు సారాతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్.. వీడియో
What did Sarfaraz do? 🤪🤪 #AUSvIND pic.twitter.com/P2PgQ5KAJX
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) November 19, 2024