IPL 2026 Playoffs Schedule : ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. బెంగళూరుకు షాక్.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల (IPL 2026 Playoffs Schedule ) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.
Schedule For TATA IPL 2026 Playoffs Announced by bcci
- ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ
- ఫైనల్ మ్యాచ్ మే 31న
- మారిన ఫైనల్ మ్యాచ్ వేదిక
IPL 2026 Playoffs Schedule : ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వేదికను మార్చారు.
ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజీ మ్యాచ్‌లు మే 24తో ముగుస్తాయి. మే 26న క్వాలిఫయర్ 1 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టాప్-2 జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.
Nitish Rana : నితీశ్ రాణా ఔట్ పై వివాదం.. బెయిల్స్ పడ్డాయ్.. డెడ్‌బాల్ కాదా?
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. మే 27న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పోటీపడనుంది.
🚨 News 🚨
BCCI Announces #TATAIPL 2026 Playoffs Schedule
Qualifier 1: Dharamshala
Eliminator and Qualifier 2: New Chandigarh
Narendra Modi Stadium, Ahmedabad to Host Grand Finale 🏟️
More Details ▶️ https://t.co/32HvsabiuF#KhelBindaas pic.twitter.com/ItrNUNoxHZ
— IndianPremierLeague (@IPL) May 6, 2026
మే 29న క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు కూడా న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక మే 31న ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఐపీఎల్ 2026 విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడుతుంది.
ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. మా నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనల పరిధికి లోబడేలా లోకల్ అసోసియేషన్, అధికారుల రిక్వైర్మెంట్స్ లేకపోవడంతో వేదికను మార్చినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
* మే 26న – క్వాలిఫయర్ 1 – HPCA స్టేడియం, ధర్మశాల
* మే 27న – ఎలిమినేటర్ – న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
* మే 29న – క్వాలిఫయర్ 2 – న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
* మే 31న – ఫైనల్ మ్యాచ్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
