కంగ్రాట్స్ : తల్లి అయిన తర్వాత..టైటిల్ గెలిచిన సెరెనా విలియమ్స్

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 05:16 AM IST
కంగ్రాట్స్ : తల్లి అయిన తర్వాత..టైటిల్ గెలిచిన సెరెనా విలియమ్స్

Updated On : January 13, 2020 / 5:16 AM IST

తల్లి అయిన తర్వాత టెన్నిస్‌లో మొదటి టైటిల్‌ను గెలుపొదారు సెరెనా విలియమ్స్. 38 సంవత్సరాలు గల సెరెనా..2017, సెప్టెంబర్ 01వ తేదీన కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆటకు కొన్ని రోజులు దూరంగా ఉన్నారామె. తాజాగా ఆక్లాండ్‌లో ASB క్లాసిక్ పోటీలో అమెరికన్ క్రీడాకారిణి జెస్సికాను 6-3, 6-4 తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. 

గెలుపొందిన అనంతరం చాలా ఆనందంగా ఉందన్నారు సెరానా. ఇది చాలా ముఖ్యమైందని, ఆటతీరును ఇలాగే కొనసాగిస్తానని తెలిపారు. లక్ష్యానికి చేరుకోవడానికి మొదటి విజయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో దిగేందుకు సమయం తీసుకున్నట్లు తెలిపారు. 

2018, మార్చిలో WTA టూర్‌కు ఈమె తిరిగి వచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో గత డిసెంబర్‌ నెలలో జరిగిన ఎగ్జిబీషన్ మ్యాచ్‌లో ఆమె కనబడ్డారు. 2018, 2019లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు. విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ మ్యాచ్‌లకు సన్నద్ధమౌతున్నారు. ఇప్పటికే ఏడుసార్లు టైటిల్ గెలిచారామె. 2020, జనవరి 20వ తేదీ నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

రూ. 43 వేల డాలర్లను ఆస్ట్రేలియాకు ఇవ్వనున్నట్లు ఇదివరకే విలియమ్స్ వెల్లడించారు. ఆస్ట్రేలియా అడవుల్లో గత నాలుగు నెలలుగా మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంటల కారణంగా లక్షలాది జంతువులు, పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోయాయి. 

Read More : విచారం ఉన్న వ్యక్తులు ఛైన్ స్మోకర్స్ అయ్యే ఛాన్స్