Shahid Afridi : ఈ భార్యతో అయినా సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నా.. షోయబ్‌కు ఆఫ్రిది విష్..

షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై షాహిద్ అఫ్రీది స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూనే ఈ భార్యతో అయినా సంతోషంగా ఉండమంటూ విష్ చేశారు.

Shahid Afridi : ఈ భార్యతో అయినా సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నా.. షోయబ్‌కు ఆఫ్రిది విష్..

Shahid Afridi

Updated On : January 24, 2024 / 7:07 PM IST

Shahid Afridi : షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను పెళ్లాడినట్లు ఇటీవలే సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీరి వివాహంపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది షోయబ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జీవితాంతం ఈ భార్యతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ విష్ చేయడం విశేషం.

Also Read: ఫోన్లో షోయబ్ మాలిక్ మొదటి పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా?

భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జాతో విడిపోయారనే పుకార్ల మధ్య షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌తో తన పెళ్లైందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కి ఇది మూడో పెళ్లి కాగా.. సనాకి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది స్పందించారు. తమ దేశ టీవీ ఛానెల్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో షోయబ్-సనా జంటకు శుభాకాంక్షలు చెప్పారు. షోయబ్ తన జీవితాంతం ఈ భార్యతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై ఏడాది క్రితమే హింట్ ఇచ్చాడా?

షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సనా జావేద్‌ను పెళ్లాడినట్లు ప్రకటించారు. సనాకి గతంలో పాకిస్తానీ సింగర్ ఉమైర్ జైస్వాల్‌తో 2020 లో పెళ్లైంది. ఇక సానియా కుటుంబం నుండి షోయబ్, సానియా కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్నారంటూ ప్రకటన చేశారు. ‘ఈ విషయాన్ని బయటకు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది.. షోయబ్ కొత్త జీవిత ప్రయాణానికి శుభాకాంక్షలు.. ఈ సున్నిత సమయంలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా..ఆమె గోప్యతను గౌరవించాలనుకుంటున్నాము’ అంటూ సానియా కుటుంబం తమ ప్రకటనలో తెలిపారు.