Shreyas Iyer : తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌..

ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్ తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

Shreyas Iyer : తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్‌..

Shreyas Iyer 95 Run Knock In Ranji Trophy Final

Shreyas Iyer – Ranji Trophy Final : ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్ తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. వాంఖ‌డే వేదిక‌గా విద‌ర్భ‌తో జ‌రుగుతున్న రంజీట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు త‌రుపున బ‌రిలోకి దిగిన శ్రేయ‌స్ అయ్య‌ర్ రెండో ఇన్నింగ్స్ లో 111 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 95 ప‌రుగులు చేశాడు. భారీ షాట్‌కు యత్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.

గ‌తకొంత కాలంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ పేల‌వ ఫామ్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ అనంత‌రం జ‌ట్టులో చోటు కోల్పోయాడు. రంజీట్రోఫీలో తొలుత ఆడేందుకు నిరాక‌రించ‌డంతో బీసీసీఐ అత‌డి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేసింది. ఈ క్ర‌మంలో సెమీఫైన‌ల్ మ్యాచ్ నుంచి రంజీలో అందుబాటులోకి వ‌చ్చాడు. తొలి మ్యాచ్‌లో 8 బంతుల్లో 3 ప‌రుగులు చేసి నిరాశ‌ప‌రిచాడు.

R Praggnanandhaa : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ధ‌న్య‌వాదాలు

ఇక విద్భ‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో మొద‌టి ఇన్నింగ్స్ 15 బంతులు ఆడి 7 ప‌రుగులే చేశాడు. దీంతో అత‌డిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొద‌లైంది. అయితే.. రెండో ఇన్నింగ్స్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడు ముషీర్ ఖాన్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 168 ప‌రుగుల‌ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

ఈ మ్యాచ్ విషయానికి వ‌స్తే.. ముంబై మొద‌టి ఇన్నింగ్స్‌లో 224 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత విద‌ర్భ త‌న తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 105 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ముంబైకి 119 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాట‌ర్లు రెచ్చిపోయారు. ముషీర్ ఖాన్ (136) సెంచ‌రీ చేయ‌గా, శ్రేయ‌స్ అయ్య‌ర్ (95), అజింక్యా ర‌హానె (73) లు రాణించ‌డంతో 127 ముగిసే స‌రికి రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 408 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ముంబై 527 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Rinku Singh : చిన్న పిల్లాడికి సారీ చెప్పిన రింకూసింగ్‌.. ఏం జ‌రిగిందో తెలుసా..?