Simon Doull: పాకిస్తాన్‌లో జీవించడం జైలులో జీవించడం లాంటిది
తాను పాకిస్తాన్‌లో ఎదుర్కొన్న మానసిక హింస గురించి డౌల్ తాజాగా బయటపెట్టాడు.కొద్ది రోజులు తిండి లేకుండా ఇబ్బంది పడ్డానని, మానసికంగా ఎంతో హింసకు గురైనట్లు వెల్లడించాడు. ఎలాగోలా పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయట పడినట్లు తెలిపాడు.

Simon Doull
Simon Doull: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన సైమన్ డౌల్(Simon Doull) కామెంటేటర్(వ్యాఖ్యత)గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లలో తన వ్యాఖ్యానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. అప్పుడప్పుడు డౌల్ ఆటగాళ్లపై చేసే విమర్శలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇటీవల ఓ పాక్ ఆటగాడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో తాను పాకిస్తాన్‌లో ఎదుర్కొన్న మానసిక హింస గురించి డౌల్ తాజాగా బయటపెట్టాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ స్ట్రైక్ రేట్ గురించి దెప్పి పొడిచాడు సైమన్ డౌల్. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ 65 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అయితే.. 83 నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి బాబర్ 14 బంతులు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. దీనిపైనే కామెంటేటర్ అయిన డౌల్ మాట్లాడుతూ.. బాబర్ బంతులను వృధా చేశాడని, అతడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా టీమ్ కోసం ఆడి ఉంటే మరిన్ని పరుగులు చేసేవాడని, అప్పుడు తన టీమ్ గెలిచి ఉండేదని వ్యాఖ్యానించాడు.
IPL 2023, PBKS vs GT: ఆ హిట్టర్ వచ్చేశాడు.. గుజరాత్‌కు కష్టమే..!
ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్, సైమన్ డౌల్ మధ్య పెద్ద వివాదమే నడిచింది. అదే సమయంలో బాబర్ అభిమానులు డౌల్ ను బెదిరించారు. డౌల్ బస చేస్తున్న హోటల్ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండడంతో తాను తినేందుకు కనీసం బయటకు కూడా వెళ్లలేకపోయినట్లు డౌల్ చెప్పాడు.కొద్ది రోజులు తిండి లేకుండా ఇబ్బంది పడ్డానని, మానసికంగా ఎంతో హింసకు గురైనట్లు వెల్లడించాడు. ఎలాగోలా పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయట పడినట్లు తెలిపాడు. తాను పడిన బాధను తెలియస్తూ పాకిస్తాన్‌లో జీవించడం అంటే జైలు జీవితంతో సమానం అనే వ్యాఖ్యలను సైమన్ డౌల్ చేశారు.