SA vs IND : భారత్‌తో మొదటి వన్డే.. 0, 0, 6, 2, 0, 4, 7.. దక్షిణాఫ్రికా బ్యాటర్ల స్కోర్లు ఇవీ
SA vs IND 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి.

SA vs IND 1st ODI
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భావించింది. అయితే.. భారత బౌలర్లు విజృంభించడంతో సఫారీ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అతడితో పాటు అవేశ్‌ఖాన్ నాలుగు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో (33), టోనీ డి జోర్జి (28), మార్‌క్రమ్ (12), తబ్రైజ్ షమ్సీ (11 నాటౌట్) మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. రీజా హెండ్రిక్స్ (0), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(0), వియాన్ ముల్డర్ (0) లు డకౌట్ అయ్యారు. మిగిలిన వారు హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్ మహరాజ్ (4), నాండ్రే బర్గర్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.