IND vs SA T20 Series: భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..! సిరీస్ నుండి కీలక ప్లేయర్ ఔట్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో 10న జరుగుతుంది. డిసెంబర్ 12న రెండో మ్యాచ్..

Lungi Ngidi
Lungi Ngidi : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో జరుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్‌గిడి టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక పోవడంతో లుంగీ ఎన్‌గిడిని జట్టు నుంచి యాజమాన్యం తప్పించింది. అతని స్థానంలో బైరాన్ హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు. భారత్ తో జరిగే టెస్టు సిరీస్ లో అతని తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే, అప్పటి వరకు ఫిట్ గా ఉంటేనే లుంగీ ఎన్‌గిడి జట్టులోకి తిరిగివచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : Matthew Renshaw : ఒక్క బంతికే 7 పరుగులు.. సిక్స్ కొట్టలేదు.. ఇదేలా సాధ్యం.. వీడియో వైరల్
భారత్ జట్టుతో టీ20 సిరీస్ కు దక్షిణాఫ్రికా జట్టు కీలక బౌలర్ కగిసో రబడకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుం లుంగీ ఎన్‌గిడి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇద్దరు కీలక పేసర్లు జట్టులో లేకపోవటంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్, ఒట్నియల్ బార్టమన్, లిజార్డ్ విలియమ్స్ కు అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం తక్కువ. ఈ క్రమంలో ఈ నలుగురు బౌలర్లు భారత్ బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
లుంగీ ఎన్‌గిడి నిష్ర్కమణ తరువాత దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చిన 33ఏళ్ల బైరాన్ హెండ్రిక్స్ రెండేళ్లకుపైగా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి రానున్నాడు. అతను చివరిసారిగా జూలై 2031లో ప్రోటీస్ జట్టుకు ఆడాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటి వరకు ఒక టెస్టు, ఎనిమది వన్డే, 19 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో 10న జరుగుతుంది. డిసెంబర్ 12న రెండో మ్యాచ్ గ్కెబెర్హాలో జరుగుతుంది. డిసెంబర్ 14న జోహన్నెస్ బర్గ్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. టీ20 సిరీస్ తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
Big blow for the Proteas ahead of the T20I series against India ?#SAvINDhttps://t.co/lsCfP1jKhz
— ICC (@ICC) December 8, 2023