Spain soccer chief : ముద్దు ఘటన తర్వాత స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ రాజీనామా
స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ క్రీడాకారిణికి బహిరంగంగా ముద్దు ఇచ్చి లూయిస్ వివాదం సృష్టించారు. గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలతో స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ హెడ్ లూయిస్ రూబియల్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు....

Spain soccer chief kissing
Spain soccer chief : స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ క్రీడాకారిణికి బహిరంగంగా ముద్దు ఇచ్చి లూయిస్ వివాదం సృష్టించారు. గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలతో స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ హెడ్ లూయిస్ రూబియల్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. (Spain soccer chief Luis Rubiales) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రుబియాల్స్ రాజీనామాను ధ్రువీకరించారు.
US Open 2023: నోవాక్ జొకోవిచ్‌కు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
గత సోమవారం స్పానిష్ ప్రాసిక్యూటర్ జెన్నీ హెర్మోసో ముద్దుకు సంబంధించి లైంగిక వేధింపులు, బలవంతం చేసిన రుబియాల్స్పై హైకోర్టులో దావా వేశారు. (resign after World Cup kissing scandal) ఆగస్ట్ 20వతేదీన సిడ్నీలో స్పెయిన్ వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత లూయిస్ ప్రవర్తనపై విచారణ పెండింగ్‌లో ఉంది. రూబియాల్స్ను మూడు నెలల పాటు ఫుట్‌బాల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫీఫా నిషేధించింది.
Maharashtra : థానే హైరైజ్ భవనంలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి
క్రీడాకారిణిని ముద్దాడిన ఘటనపై స్పానిష్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముద్దుకు తాను సమ్మతి ఇవ్వలేదని హెర్మోసో చెప్పడంతో ఫుట్ బాల్ సమాఖ్య లూయిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 46 ఏళ్ల రూబియల్స్ మాజీ ఆటగాడు. 2018వ సంవత్సరం నుంచి ఇతను అతిపెట్ట ప్లేయర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొనసాగుతున్న ముద్దు వివాదంపై లూయిస్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.