Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్, ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఎయిడెన్‌ మార్క్రమ్(Aiden Markram) ఎట్ట‌కేల‌కు వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాడు. త‌న చిర‌కాల స్నేహితురాలు నికోల్‌(Nicole)ను పెళ్లి చేసుకున్నాడు.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

Aiden Markram-Nicole

Aiden Markram-Nicole : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్, ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఎయిడెన్‌ మార్క్రమ్(Aiden Markram) ఎట్ట‌కేల‌కు వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాడు. త‌న చిర‌కాల స్నేహితురాలు నికోల్‌(Nicole)ను పెళ్లి చేసుకున్నాడు. సెంచూరియ‌న్‌లో వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, బంధువులు వీరి వివాహానికి హాజ‌రై కొంత జంట‌ను ఆశీర్వ‌దించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను నికోల్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

Korea Open 2023 : కొరియా ఓపెన్‌లో సంచ‌ల‌నం.. సాత్విక్‌-చిరాగ్ జోడిదే టైటిల్‌

కాగా.. ఎయిడెన్‌ మార్క్రమ్, నికోల్‌లు గ‌త 10 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తేడాది వీరిద్దిరి నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు, ప‌లువురు క్రికెట‌ర్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక స‌న్ రైజ‌ర్స్ ఫ్యాన్స్ మాత్రం అత్తా, మామా మీ జోడి బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అత్త చాలా బాగుంది. కావ్యా పాప‌ కంటే కూడా సూప‌ర్‌గా ఉంద‌ని ఓ నెటీజ‌న్ అన్నాడు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఈ సీజ‌న్‌లో మార్క్ర‌మ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించడంతో అత‌డి అభిమానులు ముద్దుగా మామా అని పిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక నికోల్ విష‌యానికి వ‌స్తే.. ఆన్‌లైన్‌లో సొంతంగా ఓ జ్యువెల‌రీ స్టోర్‌ను న‌డుపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by NICOLE DANIELLE MARKRAM 🦋 (@nicoledmarkram)

IND-W Vs BAN-W : ఒత్తిడిలో భార‌త్ చిత్తు.. 9 ప‌రుగుల‌కే 4 వికెట్లు.. మూడో వ‌న్డే టై.. సిరీస్ స‌మం

ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ కేప్ టౌన్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌హ‌రించిన మార్క్రమ్ ఆరంభ సీజ‌న్‌లోనే జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. దీంతో ఐపీఎల్‌లోనూ ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా నియ‌మించారు. అయితే.. అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. 14 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో మాత్ర‌మే గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో మార్క్రమ్ మొత్తం 33 మ్యాచ్‌లు ఆడాడు. 32.29 సగటు 131.36 స్ట్రైక్ రేట్‌తో 775 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్యుత్త‌మ స్కోరు 68.

Ayesha Naseem : అయేషా నసీమ్ ఎవరు..? 18 ఏళ్ల వ‌య‌సులోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఎందుకు ప్ర‌కటించింది..?