SRH విలియమ్‌సన్.. ఖలీల్ అహ్మద్‌లు ఢిల్లీ మ్యాచ్‌తో రంగంలోకి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు.

SRH విలియమ్‌సన్.. ఖలీల్ అహ్మద్‌లు ఢిల్లీ మ్యాచ్‌తో రంగంలోకి

Updated On : April 10, 2019 / 11:06 AM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు. లీగ్‌లో కొద్ది మ్యాచ్‌లకు గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న విలియమ్సన్, ఖలీల్ అహ్మద్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. 
Read Also : KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..

2018సీజన్‌లో 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన విలియమ్సన్ రాక జట్టులోనే కాక, హైదరాబాద్ అభిమానుల్లోనూ సంతోషాన్ని పెంచింది. ఏప్రిల్ 14న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌తో వీరిద్దరూ లీగ్‌లో పునరాగమనం చేయలేరు. 

న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్న సమయంలోనే విలియమ్సన్ గాయానికి లోనై సీజన్ ఆరంభమైనప్పటి నుంచి కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ .. ‘ఏప్రిల్ 14న ఉన్న ఉప్పల్2లో మ్యాచ్ సందర్భంగా త్వరలోనే అక్కడికి చేరుకుంటాం. ఈ మ్యాచ్‌కు కేన్ విలియమ్‌సన్‌తో పాటు ఖలీల్ అహ్మద్ కూడా ఉండబోతున్నాడు’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 

Read Also : కోహ్లీ టీంకి మరో షాక్ : పార్థివ్ పటేల్ తండ్రికి సీరియస్