ENG vs SL : ఇంగ్లాండ్‌కు షాక్.. శ్రీలంక ఘన విజయం.. సెమీస్ రేసు నుంచి బట్లర్ సేన ఔట్..?
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Sri Lanka
England vs Sri Lanka : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. బెంగళూరు వేదికగా శ్రీలంక తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో శ్రీలంక తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే.. ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతు అయ్యాయి. ఇంగ్లాండ్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో ఛేదించింది.
ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (77 నాటౌట్; 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (65నాటౌట్; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించారు. కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండీస్ (11) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.
IPL 2024 : ఎడారి దేశంలో ఐపీఎల్ వేలం..? ఎప్పుడంటే..?
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌స్టోక్స్ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు), బెయిర్ స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలాన్ (28)లు ఫర్వాలేదనిపించారు. రూట్ (3), కెప్టెన్ జోస్ బట్లర్ (8), లివింగ్ స్టోన్ (1), క్రిస్ వోక్స్ (0)లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు గల్లంతు..!
శ్రీలంక పై ఓడిపోవడంతో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌లో 5 మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ ఒకే ఒక మ్యాచులో విజయం సాధించింది. రెండు పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో (తొమ్మిదో) స్థానంలో ఉంది. ఇక ఈ టోర్నీలో ఇంగ్లాండ్ మరో నాలుగు మ్యాచులు ఆడనుంది. ఒకవేళ ఈ నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించినా 10 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లే.
Sri Lanka have upended a strong England lineup to keep their #CWC23 semi-finals qualification hopes alive ?
With this, they have triumphed in their last five ICC Men’s Cricket World Cup encounters against England ?#ENGvSL ?: https://t.co/VsDcKNha02 pic.twitter.com/WORxTQSajE
— ICC Cricket World Cup (@cricketworldcup) October 26, 2023