ODI World Cup 2023 : శ్రీలంక‌కు భారీ షాక్‌.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్లు..

మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డ్డ‌ట్లు అన్న చందంగా త‌యారైంది శ్రీలంక జ‌ట్టు ప‌రిస్థితి. అస‌లే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓట‌మి పాలై పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది.

ODI World Cup 2023 : శ్రీలంక‌కు భారీ షాక్‌.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్లు..

Sri Lanka

Updated On : October 15, 2023 / 3:30 PM IST

ODI World Cup : మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డ్డ‌ట్లు అన్న చందంగా త‌యారైంది శ్రీలంక జ‌ట్టు ప‌రిస్థితి. అస‌లే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓట‌మి పాలై.. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. మెగా టోర్నీలో గెలుపు రుచి చూసేందుకు ఆరాట ప‌డుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఆ జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్‌, ఆల్‌రౌండ‌ర్ దసున్ షనక ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలియ‌జేసింది. అత‌డి స్థానంలో చ‌మిక క‌రుణ‌ర‌త్నేను ఎంపిక చేసింది. ఇందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది.

Dasun Shanaka ruled out of ODI World Cup 2023

Dasun Shanaka ruled out of ODI World Cup 2023

అక్టోబ‌ర్ 10న ఉప్ప‌ల్ వేదిక‌గా పాకిస్థాన్ జ‌ట్టుతో శ్రీలంక త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ష‌న‌క కుడి తొడ కండ‌రాల‌కు గాయ‌మైంది. అత‌డు పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 3 నుంచి 4 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపారు. దీంతో అత‌డు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్నాడు. కెప్టెన్ అయిన శ‌న‌క త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో వైస్ కెప్టెన్ అయిన కుశాల్ మెండీస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది.

IND vs PAK : బాబ‌ర్‌ను తిట్టిపోస్తున్న మాజీ క్రికెట‌ర్లు.. మ్యాచ్ ఓడిపోతే ప‌బ్లిక్‌గా కోహ్లీ జెర్సీ తీసుకుంటావా..? మీ అంకుల్ అబ్బాయి అయితే..

ప‌తిరనాకు గాయం..

ఓ వైపు ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే మ‌రో వైపు గాయాలు శ్రీలంక జ‌ట్టును వేధిస్తున్నాయి. తొడ కండ‌రాల గాయంతో కెప్టెన్ శ‌న‌క దూరం కాగా.. జూనియర్ మ‌లింగ గా గుర్తింపు తెచ్చుకున్న యువ పేస‌ర్ మ‌తీషా ప‌తిరాన సైతం భుజం గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డు రెండు లేదా మూడు మ్యాచుల‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంది. సోమ‌వారం శ్రీలంక జ‌ట్టు ల‌క్నో వేదిక‌గా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది.