ఇద్దరు సెంచరీలు చేసినా ఓటమి తప్పలేదు..

ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా అఫ్గానిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది.

ఇద్దరు సెంచరీలు చేసినా ఓటమి తప్పలేదు..

Azmatullah Omarzai Mohammad Nabi hit Centuries

Updated On : February 10, 2024 / 10:43 AM IST

Sri Lanka vs Afghanistan1st ODI: ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా అఫ్గానిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో చివరి వరకు పోరాడి 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ సెంచరీలతో జట్టును గెలిచిపించే ప్రయత్నం చేసినా వారి పోరాటం ఫలించలేదు. ఒమర్జాయ్ 115 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 149 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మహమ్మద్ నబీ 130 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 136 పరుగులు చేసి అవుటయ్యాడు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక అద్భుతంగా బ్యాటింగ్ చేసి రికార్డు డబుల్ సెంచరీ సాధించాడు. 139 బంతుల్లోనే 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 210 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Also Read: వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ.. గేల్‌, సెహ్వాగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన నిస్సాంక‌