సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త బౌలింగ్ కోచ్… ఇక బౌలింగ్‌లో మనోళ్లు రెచ్చిపోతారా?
ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వరుణ్ అరోన్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Varun Aaron
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ అరోన్(35)ను నియమించింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వరుణ్ అరోన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
“మా కోచింగ్ స్టాఫ్‌లో ఓ ఫైరి చేరాడు. కొత్త బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్‌కు స్వాగతం” అని ఎస్‌ఆర్‌హెచ్ తమ ‘ఎక్స్’ అకౌంట్‌లో పేర్కొంది. 2011 నుంచి 2015 మధ్య కాలంలో అరోన్ భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. 2025 జనవరి 5న జైపూర్‌లో ఝార్ఖండ్ తరఫున గోవాతో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. ఝార్ఖండ్ నాకౌట్ దశలోకి చేరకపోవడంతో అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అరోన్ 150 కిమీ/గం పైగా వేగంతో బౌలింగ్ చేసే యువ పేసర్‌గా గుర్తింపు పొందాడు. ఈ వేగమే అప్పట్లో జాతీయ సెలక్షన్ల దృష్టిలో అతడిని పడేలా చేసింది. అప్పటి బీసీసీఐ అరోన్‌తో పాటు మరో యువ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా బాగా ప్రోత్సహించింది. అయితే ఉమేశ్ 50కి పైగా టెస్టులు ఆడగా, వరుణ్ కెరీర్ గాయాల కారణంగా అంతగా సక్సెస్ కాలేదు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాక అరోన్ టీవీ వ్యాఖ్యాతగా పనిచేశాడు.
A fiery addition to our coaching staff! Welcome Varun Aaron as our new bowling coach 🔥🧡#PlayWithFire pic.twitter.com/qeg1bWntC5
— SunRisers Hyderabad (@SunRisers) July 14, 2025