India vs Pakistan: 3 మార్పులతో ఫైనల్‌ బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఏమన్నాడంటే?

టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

India vs Pakistan: 3 మార్పులతో ఫైనల్‌ బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఏమన్నాడంటే?

Asia Cup 2025 Suryakumar Yadav

Updated On : September 28, 2025 / 7:52 PM IST

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్‌ ఫైట్ జరుగుతోంది. ఇండియా, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్‌, అర్షదీప్‌, హర్షిత్‌ స్థానంలో బుమ్రా, దుబే, రింకు జట్టులోకి వచ్చారు. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్‌-పాక్ మధ్య తొలిసారి ఫైనల్‌ మ్యాచ్ జరుగుతోంది.

టాస్‌ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్‌ చేస్తాం. మేము మొదట బ్యాటింగ్‌కు దిగినా బాగా ఆడుతున్నప్పటికీ, ఈరోజు మాత్రం చేజ్‌ చేయాలని అనుకుంటున్నాం. గత 5-6 మ్యాచ్‌లు మేము ఆడిన తీరు బాగానే ఉంది, దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం. దురదృష్టవశాత్తు హార్దిక్‌ చిన్న గాయం కారణంగా మిస్సవుతున్నాడు. అర్షదీప్‌, హర్షిత్‌ కూడా మిస్సవుతున్నారు. బుమ్రా, దుబే, రింకు జట్టులోకి వచ్చారు” అని తెలిపాడు.

భారత జట్టు
ప్లేయింగ్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్‌సన్ (వికెట్ కీపర్), శివమ్ దుబే, రింకు సింగ్, ఆక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

బెంచ్: హర్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ

పాకిస్థాన్‌ జట్టు
ప్లేయింగ్: సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ ఆయబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హరిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫాహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిడి, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్

బెంచ్: హసన్ అలీ, ఖుష్దిల్ షా, మొహమ్మద్ వాసిం జూనియర్, సల్మాన్ మిర్జా, హసన్ నవాజ్, సుఫియాన్ ముకీం