సిడ్నీ వన్డే: భారత్ టార్గెట్ 289 రన్స్

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 06:22 AM IST
సిడ్నీ వన్డే: భారత్ టార్గెట్ 289 రన్స్

సిడ్నీ: తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా 289 రన్స్ చేయాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నస్టానికి 288 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ హ్యాండ్స్‌కాంబ్ (61 బంతుల్లో 73 పరుగులు), షాన్ మార్ష్ (70 బంతుల్లో 54 పరుగులు), ఖవాజా (81 బంతుల్లో 59 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ తీశాడు.