T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 6

T20 World Cup 2021 Australia Won
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 6.2ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 78 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
Smokers Food : సిగరెట్ తాగే వారు ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులు సేఫ్…
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా (5/19) దెబ్బకు బంగ్లా హడలెత్తిపోయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ఓపెనర్లు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (40), డేవిడ్ వార్నర్ (18) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు అర్ధశతకం (58) భాగస్వామ్యం నిర్మించారు. అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ (16*), మ్యాక్స్‌వెల్ (0*) ఇంకో వికెట్ పడనీయకుండా 78 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఇస్లామ్ చెరో వికెట్ పడగొట్టారు.
CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసిరాలేదు. తొలుత స్టార్క్, హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన బంగ్లా బ్యాటర్లు.. తర్వాత వచ్చిన ఆడమ్ జంపా (5/19)కు దాసోహమన్నారు. వెంటవెంటనే వికెట్లుపడ్డాయి. బంగ్లా బ్యాటర్లలో నలుగురు(లిటన్ దాస్, హుస్సేన్, హసన్, ఇస్లామ్) మిగతావారిలో నయీమ్ 17, సౌమ్య సర్కార్ 5, ముష్ఫికర్ రహీమ్ 1, మహమ్మదుల్లా 16, షమీమ్ 19, తస్కిన్ 6*, ముస్తాఫిజర్ 4 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 5, స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో మెరుగైన రన్ రేట్ తో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్ 12 గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం నాలుగేసి మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా (6), ఆస్ట్రేలియా (6) పోటీ పడుతున్నాయి. ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంది. ఇక తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తలపడతాయి. ఒక్క విజయం లేకుండానే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.