T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బోణీ.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 దశలో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బోణీ.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ

T20 World Cup 2021 England

Updated On : October 23, 2021 / 10:11 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12 దశలో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత విండీస్ ను 55 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్.. 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేజ్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 8.2 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోసీన్ రెండు వికెట్లు తీశాడు. రవి రాంపాల్ ఒక వికెట్ తీశాడు.

T20 World Cup 2021 : ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. అప్పుడే బెట్టింగ్‌ షురూ

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. బంతితో నిప్పులు చెరిగారు. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఎవరూ ఊహించని విధంగా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. కరీబియన్లు 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

ఆ జట్టులో 13 పరుగులు చేసిన క్రిస్ గేల్ టాప్ స్కోరర్ అంటే మిగతా వాళ్లు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ నుంచి టెయిలెండర్ రవి రాంపాల్ వరకు అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 4 వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. మొయిన్ అలీ, టైమల్ మిల్స్ తలో రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ తీశారు.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ (4/2) దెబ్బకి విండీస్ విలవిలలాడింది. వరుసగా వికెట్లు పడుతున్నా.. భారీ షాట్ కోసం ప్రయత్నించిన కరీబియన్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. 2016లో చివరిగా టీ20 వరల్డ్‌కప్‌ జరగగా.. ఆ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పైనే వెస్టిండీస్ గెలిచిన విషయం తెలిసిందే.