T20 World Cup 2021 : ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. అప్పుడే బెట్టింగ్‌ షురూ

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది.

10TV Telugu News

T20 World Cup 2021 : టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. సూపర్-12లో భాగంగా అబుదాబి‌ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఢీకొన్నాయి. 2016లో చివరిగా టీ20 వరల్డ్‌ కప్‌ జరగగా.. ఇంగ్లాండ్‌పై ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వైట్ ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ని గెలిపించాడు. వెస్టిండీస్ ఇప్పటికే రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ గెలవగా.. ఇంగ్లాండ్ ఒకసారి విజేతగా నిలిచింది.

ఆదివారం (అక్టోబర్ 24,2021) శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకి యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్టోబర్ 24న ఇండియా, పాక్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఇండియా పాక్ మ్యాచ్ పై అప్పుడే బెట్టింగ్ లు షురూ అయ్యాయి. ఏ జట్టు టాస్ విన్ అవుతుంది, ఎవరు ఎంత కొడతారు.. ఎవరెన్ని వికెట్లు తీస్తారు, టీం 11 లో ఎవరు ఉంటారు… ఇలా అన్నింటిపై పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.

ఆన్ లైన్ మార్కెట్ లో పాక్ పై వెయ్యి కి రూ.1600, ఇండియా పై వెయ్యికి రూ.530 బెట్ కాశారు. బయట మార్కెట్ లో పాక్ పై వెయ్యికి రూ.4 వేలు, ఇండియా పై వెయ్యికి రూ.2 వేలు బెట్ కాశారు. మొదటి బాల్ నుండి చివరి బంతి వరకు బెట్టింగ్ లకు ప్లాన్ చేశారు. బుకీలు కొత్త కొత్త రేట్లు ఆశ
చూపుతున్నారు. కాగా, బెట్టింగ్ మాఫియా పై పోలీసులు ఫోకస్ పెట్టారు. గతంలో అరెస్ట్ చేసిన బుకీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని, జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు పోలీసులు సూచించారు.

WhatsApp: పది రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు.. పూర్తి లిస్ట్ ఇదే!

మొత్తంగా.. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నాయి. గ్రూప్-1లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో స్కాట్లాండ్, భారత్, నమీబియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ టీమ్స్ ఉన్నాయి. ఇందులోని నాలుగు జట్లు.. బంగ్లాదేశ్, శ్రీలంక, స్కాట్లాండ్, నమీబియా క్వాలిఫయింగ్ రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడి సూపర్-12కి అర్హత సాధించాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టూ మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆడనుంది.

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాక్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే? రెండు జట్లూ ఇప్పటి వరకు 5 సార్లు ఢీకొనగా.. అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. రేపటి మ్యాచ్‌లో భారత్‌ని ఓడిస్తామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ధీమా వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్ ఒకరోజు ముందే తుది జట్టుని ప్రకటించేసింది. మొత్తం 12 మందితో కూడిన జట్టుని పాక్ ఈరోజు ప్రకటించింది.

భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రౌఫ్, హైదర్ అలీ