T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో నమీబియా బోణీ.. తొలి మ్యాచ్‌లోనే విజయం
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా బోణీ కొట్టింది. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

T20 World Cup 2021
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 దశలో నమీబియా బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే గెలుపొందింది. స్కాట్లాండ్ తో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జేజే స్మిత్ (32), విలియమ్స్ (23), మైఖేల్ వాన్ లింగెన్ (18) తలో చేయి వేయడంతో స్కాట్లాండ్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించింది. స్కాట్లాండ్ బౌలర్లలో లియాస్క్ రెండు వికెట్లు తీశాడు. వాట్, గ్రీవ్స్, షరీఫ్, వీల్ తలో వికెట్ తీశారు.
LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఆశించిన మేర ఆడలేకపోయింది. మొత్తమ్మీద 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 109 పరుగులే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. లెఫ్టార్మ్ సీమర్ రూబెన్ ట్రంపుల్ మన్ అద్భుతమైన బౌలింగ్ తో స్కాట్లాండ్ టాపార్డర్ ను కకావికలం చేశాడు. అయితే, లోయరార్డర్ లో లీస్క్ 44, క్రిస్ గ్రీవ్స్ 25 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ స్కోరు 100 పరుగులు దాటింది. నమీబియా బౌలర్లలో ట్రంపుల్ మన్ 3, ఫ్రైలింక్ 2, స్మిట్, వీజ్ తలో వికెట్ తీశారు.
స్కోర్లు..
స్కాట్లాండ్-109/8
నమీబియా-115/6(19.1 ఓవర్లు)