IND vs IRE : భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌ను ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌కు సిద్దమైంది.

T20 World Cup 2024 all India matches Live Broadcast on DD Sports
IND vs IRE : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అనిశ్చితి మారుపేరైన టీ20 క్రికెట్‌లో చిన్న జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఈ క్రమంలో రోహిత్ సేన ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు.
రెండు జట్ల బలాబలాను పరిశీలిస్తే టీమ్ఇండియానే హాట్ ఫేవరేట్ అని చెప్పవచ్చు. అయితే.. డ్రాప్ ఇన్ పిచ్‌పై మ్యాచ్ జరగనుండడంతో పిచ్ ఎలా స్పందిస్తుంది అనేది చెప్పడం కష్టం. భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమని ఇప్పటికే రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డాడు. 140 నుంచి 150 స్కోర్లు చేసినా కూడా కాపాడుకోవచ్చునని చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
Virat Kohli : అరుదైన రికార్డు పై కోహ్లి కన్ను.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనే అందుకుంటాడా..?
అటు హార్దిక్ పాండ్య, శివమ్ దూబెలు ఆల్‌రౌండర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. అయితే.. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లు మనదేశంలో టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో తెలుగుతో పాటు కన్నడ, మళయాళం, తమిళ, భోజ్‌పూర్, హిందీ కామెంట్రీతో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఇక భారత జట్టు ఆడే మ్యాచులను దూరదర్శన్ ఉచితంగా ప్రసారం చేయనుంది.
Pakistan : అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసిన పాకిస్తాన్ జట్టు.. ఒక్కొక్కరికి 25 డాలర్లు..!
Match Day! ??vs??
? #INDvIRE ⏰ 8 PM onwards..
LIVE & Exclusive on DD Sports ? (DD Free Dish)#TeamIndia #Cheer4India #T20WorldCup #T20WConDD #Cheer4Bharat pic.twitter.com/DOtwT11Za9
— Doordarshan Sports (@ddsportschannel) June 5, 2024