Suryakumar Yadav : సూర్యకుమార్‌కు రోహిత్ అంటే ఎంత ప్రేమో.. టాస్ వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చి.. వీడియో వైరల్..
Suryakumar Yadav : ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Suryakumar Yadav
Suryakumar Yadav : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత జట్టు యూఎస్ఏతో తన తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తో భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read : IND vs USA : గంభీర్ సలహాతోనే గట్టెక్కాం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. కెప్టెన్ సూర్యకుమార్
యూఎస్ఏతో మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. దీంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న జస్ర్పీత్ బుమ్రా, హర్షిత్ రాణా ఇతర క్రికెటర్లు రోహిత్ ను చూసి అతని వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నారు. అనంతరం రోహిత్ శర్మ మరోవైపు వెళ్తున్న క్రమంలో.. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అప్పుడే టాస్ కు సిద్ధమవుతున్నాడు. టాస్ వేసే సమయంలో రోహిత్ అటుగా వెళ్తుండటాన్ని గమనించిన సూర్యకుమార్ యాదవ్.. టాస్ ను వదిలేసి పరుగెత్తుకుంటూ వెళ్లి రోహిత్ శర్మను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Suryakumar Yadav was standing for the toss when he saw Rohit Sharma passing by. He immediately left the toss and ran over to hug Rohit Sharma.❤️
The bond between sky& bRO 🫂🙌 pic.twitter.com/lWCfeiEZlH
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 7, 2026
