T20 World Cup : ఆశలన్నీ అఫ్ఘాన్పైనే..!అద్భుతాన్ని ఆశిస్తున్న టీమిండియా
పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది.

Team India
India Semi Final Chances : పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది. సూపర్12 గ్రూప్-బీలో భాగంగా 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం న్యూజిలాండ్‌తో అఫ్ఘాన్ తలపడనుంది. గ్రూప్-బీ నుంచి ఇప్పటికే పాక్ సెమీస్ చేరుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో మరో బెర్త్ తేలే ఛాన్స్ కనిపిస్తోంది.
Read More : Manike Mage Hithe: మనికె మగే హితే ఇంగ్లీష్ వెర్షన్.. ఇంకా చూడలేదా
ఈ పోరులో కివీస్ అఫ్ఘాన్‌ను ఓడిస్తే ఇండియా సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఒకవేళ న్యూజిలాండ్ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశం కోల్పోతుంది. నేరుగా న్యూజిలాండ్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక న్యూజిలాండ్‌పై అఫ్ఘాన్ గెలవడం అంత ఈజీ కాదు. బ్లాక్‌క్యాప్స్ చాలా స్ట్రాంగ్ టీమ్. పాక్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియాను చిత్తు చేసింది.
Read More : Shoaib Aktar: అఫ్ఘాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే.. పాక్ ఫ్యాన్స్ ఊరుకోరు..!
అదే జోరుతో స్కాట్లాండ్, నమీబియాపై గెలిచి ఆరు పాయింట్లతో టెబుల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విక్టరీలతో అఫ్ఘాన్ నాలుగో ప్లేస్‌లో ఉంది. ఆట, అనుభవం పరంగా తమకంటే ఎంతో ముందున్న కివీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదని అఫ్ఘాన్‌కు కూడా తెలుసు. అయితే స్పిన్‌లో కివీస్ బ్యాటర్లు వీక్‌గా ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్న అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ చెలరేగితే అఫ్ఘాన్ నుంచి అద్భుతం ఆశించొచ్చు.