T20 World Cup 2021: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు అంపైర్ సస్పెండ్
ఇంగ్లీష్ అంపైర్ మైకేల్ గాఫ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గైర్హాజరీ అవడానికి అదే కారణం.

Ind Vs Nz
T20 World Cup 2021: ఇంగ్లీష్ అంపైర్ మైకేల్ గాఫ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గైర్హాజరీ అవడానికి అదే కారణం. దీనిపై ఐసీసీ బయో సెక్యూరిటీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 బయో బబుల్ దాటి ప్రవర్తించినందుకు గానూ యాక్షన్ తీసుకుంది.
‘బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ ఉల్లంఘించినందుకు గానూ.. బయో సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ అంపైర్ మైకెల్ గాఫ్ ను ఆరు రోజుల పాటు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని ఆదేశించింది’ అని ఐసీసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన మ్యాచ్ లో అతనికి బదులుగా.. దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుత ఇంటర్నేషనల్ గేమింగ్ లో గాఫ్.. బెస్ట్ అంపైర్ గా కొనసాగుతున్నారు. అతను ఉండే హోటల్ గది నుంచి అనుమతి లేకుండా బయటకు వెళ్లి కొందరిని కలిశాడు. దాంతో అతనికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి.. ఆరు రోజుల పాటు హోటల్ గదిలోనే ఉండాలని ఆంక్షలు విధించారు. క్వారంటైన్ సమయం పూర్తి అయిన తర్వాత తిరిగి మ్యాచ్ లలో కనిపిస్తాడా అనేది ఐసీసీ కమిటీ చేతుల్లో ఉంది.