IND vs AFG : ముచ్చటగా మూడో మ్యాచ్..ఇండియా గెలిచేనా ?
టీమిండియా మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. కొత్తవేదికపై అఫ్ఘానిస్థాన్‌ను ఎదుర్కోనుంది.

Team India
India And Afghanistan Match : టీమిండియా మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. కొత్తవేదికపై అఫ్ఘానిస్థాన్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌తో పాటు స్కాట్లాండ్, నమీబియాలపై ఘనవిజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాక్, కివీస్ చేతిలో చావుదెబ్బతిన్న టీమిండియాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటింది. దీంతో మ్యాచ్‌లో భారత్‌కు విజయం అంత సులువేమీ కాకపోవచ్చని భావిస్తున్నారు.
Read More : Karthika Masam : శివకేశవులకు ప్రీతికరం….కార్తీక మాసం….ప్రతిరోజు పర్వదినమే!..
భారత తుది జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అఫ్ఘాన్‌తో ఎలా బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిస్సహాయంగా మారగా అటు పేసర్లలో బుమ్రా మినహా మరెవరూ ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయినా వరుణ్‌తోనే ముందుకు వెళ్తే మాత్రం కోహ్లీపై మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. రోహిత్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం కూడా దెబ్బతీసింది. దీంతో ఇషాన్‌తో కలిసి అతడే ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు.
Read More : Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!
అఫ్ఘానిస్థాన్ ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తోంది. తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటర్స్ కలిగిన ఈ జట్టు ఇప్పటిదాకా ఆలౌట్ కాలేదు. ఓపెనర్ల శుభారంభంతో పాటు చివర్లో నబీ హిట్టింగ్ ఉపయోగపడుతోంది. ఇక బౌలింగ్‌లో యువ పేసర్ నవీన్ ఉల్ హక్ అండగా ఉండగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్‌లను ఎదుర్కోవడం కష్టమే అంటున్నారు.