WI Vs Ind : విడతల వారీగా విండీస్‌కు పయనమైన భారత ఆటగాళ్లు.. రోహిత్, కోహ్లి లేకుండానే..
భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.

Team India
West Indies Vs India 2023 : భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. అయితే.. అందరు ఆటగాళ్లకి ఒకే విమానంలో టికెట్లు దొరక్కపోవడంతో విడుతల వారీగా విండీస్‌కు పయనమయ్యారు. మొదటి బ్యాచ్‌లో ప్రయాణించిన ఆటగాళ్లు అమెరికా, లండన్, నెదర్లాండ్స్ మీదుగా కరేబియన్‌కు దీవికి చేరుకోనున్నారు. కాగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పారిస్ నుంచి, విరాట్ కోహ్లి (Virat Kohli) లండన్ నుంచి త్వరలోనే విండీస్‌కు బయలుదేరనున్నారని అధికారులు తెలిపారు.
లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. విండీస్ పర్యటన ముందు టీమ్ఇండియా ఆటగాళ్లకు నెలరోజుల విరామం లభించింది. దీంతో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్లారు. ఈ క్రమంలోనే విరాట్ లండన్‌లోనే ఉండిపోగా, రోహిత్ శర్మ పారిస్‌కు వెళ్లారు. వీరిద్దరు కాస్త ఆలస్యంగా విండీస్‌కు చేరనున్నట్లు సమాచారం.
Virender Sehwag : కష్టం మాది.. పేరు గ్యారీ కిర్‌స్టన్ ది.. ఆ తరువాత అతడు సాధించింది సున్నా
విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా, జూలై 27 నుంచి వన్డే, ఆగస్టు 3 నుంచి టీ20 మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఇక టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) 2023-25 సైకిల్ విండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి ఆరంభం కానుంది. ఇక భారత్, విండీస్ జట్లు ఇప్పటి వరకు 98 టెస్టుల్లో తలపడగా.. టీమ్ఇండియా 22 సార్లు, విండీస్ 30 గెలిచింది.
Sourav Ganguly : 18 నెలలు ఆటకు దూరం.. వైస్ కెప్టెనా.. ఏంటో.. ?
విండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానె (వైస్‌కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.