Umesh Yadav Father Death: టీమిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి, ప్రసిద్ద మల్లయోధుడు కన్నుమూత
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి, ప్రసిద్ద మల్లయోధుడు తిలక్ యాదవ్ (74) కన్నుమూశాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించాడు.

Umesh Yadav
Umesh Yadav Father Death: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి, ప్రసిద్ద మల్లయోధుడు తిలక్ యాదవ్ (74) కన్నుమూశాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో తిలక్ యాదవ్ కు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదట పడటంతో తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, తిలక్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం రాత్రి కన్నుమూశాడు. తిలక్ యాదవ్‌కు ముగ్గురు కుమారులు కమలేష్, క్రికెటర్ ఉమేష్, రమేష్, ఒక కుమార్తె ఉంది. తిలక్ అంత్యక్రియలు నాగ్‌పూర్ జిల్లాలోని కోలార్ నది ఘాట్‌లో నిర్వహించారు.
Umesh Yadav Cheated : భారత క్రికెటర్‌ను దారుణంగా మోసం చేసిన స్నేహితుడు.. రూ.44 లక్షలకు టోకరా
తిలక్ యాదవ్ తన యవ్వనంలో ప్రసిద్ద మల్లయోధుడు. అతను ఉత్తర ప్రదేశ్ లోని ప్రదౌనా జిల్లా పోకర్ బిండా గ్రామ నివాసం. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో ఉద్యోగం కారణంగా తన కుటుంబంతో కలిసి నాగర్ పూర్ జిల్లా ఖపర్ఖేడాలో ఉన్న వాల్ని గనిలో నివాసం ఉంటున్నాడు. తిలక్ యాదవ్ మరణంతో ఉమేష్ యాదవ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఉమేష్ యాదవ్ ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఉన్నాడు.
ఇటీవల జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఉమేష్ యాదవ్‌కు అవకాశం దక్కలేదు. ఉమేష్ యాదవ్ టెస్టు జట్టులో రెగ్యులర్ గా కొనసాగుతున్నాడు. కానీ, ఇటీవలి కాలంలో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. భారత తరపున 54 టెస్టులు ఆడిన ఉమేష్ 164 వికెట్లు తీశాడు. 75వన్డేల్లో ఆడి 106వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీశాడు.