Umesh Yadav Cheated : భారత క్రికెటర్‌ను దారుణంగా మోసం చేసిన స్నేహితుడు.. రూ.44 లక్షలకు టోకరా

భారత పేసర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడే మోసం చేశాడు. ఉద్యోగం లేదు, అయ్యో పాపం అని చేరదీస్తే.. ఉమేశ్ యాదవ్ ను నిండా ముంచేశాడు. ఉమేశ్ యాదవ్ కు చెందిన లక్షల రూపాయలు కొట్టేశాడు.

Umesh Yadav Cheated : భారత క్రికెటర్‌ను దారుణంగా మోసం చేసిన స్నేహితుడు.. రూ.44 లక్షలకు టోకరా

Umesh Yadav Cheated : ఈరోజుల్లో ఎవరినీ నమ్మే పరిస్థితులు లేవు. అంతేకాదు అయ్యో పాపం అని జాలి చూపించడం కూడా తప్పే అవుతోంది. ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ఏ మనిషి ఎలా మారిపోతాడో అస్సలు ఊహించలేము. రక్త సంబంధీకులు, బంధువులనే కాదు చివరికి స్నేహితులను కూడా నమ్మే పరిస్థితి లేదు. పొరపాటున ఎవరినైనా గుడ్డిగా నమ్మేశామో.. అడ్డంగా మోసపోవడం ఖాయం. పలు సందర్భాల్లో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా భారత క్రికెటర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆ క్రికెటర్ ను స్నేహితుడే దారుణంగా మోసం చేశాడు. నమ్మి చేరదీస్తే నిండా ముంచేశాడు. ఏకంగా రూ.44లక్షలకు టోకరా వేశాడు.

అవును.. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడే మోసం చేశాడు. ఉద్యోగం లేదు, అయ్యో పాపం అని చేరదీస్తే.. ఉమేశ్ యాదవ్ ను నిండా ముంచేశాడు. ఉమేశ్ యాదవ్ కు చెందిన లక్షల రూపాయలు కొట్టేశాడు.

Also Read..Sexual Harassments IN Indian Sports: భారత క్రీడారంగంలో వేళ్లూనుకుపోయిన లైంగిక వేధింపులు? అయినా చర్యలు తీసుకోని దుస్థితి..క్రీడా స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన పరిస్థితి

నాగ్ పూర్ కు చెందిన శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి, ఆ ఫ్లాట్ ను అతడు రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఉమేశ్ ప్రశ్నించడంతో డబ్బు ఇచ్చేందుకు శైలేష్ నిరాకరించగా..క్రికెటర్ పోలీసులను ఆశ్రయించాడు.

ఉమేశ్ యాదవ్ స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్ కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. ఉమేశ్ యాదవ్ టీమిండియాకు ఎంపికయ్యాక, తన వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడు ఠాక్రేను పర్సనల్ మేనేజర్ గా నియమించుకున్నాడు. ఫ్రెండ్ కావడంతో శైలేష్ ను నమ్మిన ఉమేశ్ అతడికి తన ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు.

Usain Bolt: పరుగుల వీరుడు ఉసేన్ బోల్డ్ అకౌంట్ నుంచి 103కోట్లు మాయం..

ఈ క్రమంలో నాగపూర్ లో మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని ఉమేశ్ కు చెప్పాడు శైలేష్. దాంతో ఆ స్థలం కొనేందుకు ఆసక్తి చూపించిన ఉమేశ్ యాదవ్ రూ.44 లక్షలను శైలేష్ ఖాతాలో వేశాడు. అంతే, శైలేష్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఆ ప్లాట్ ను తన పేరిట కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. తన ఫ్రెండే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తనను ఠాక్రే దారుణంగా మోసం చేశాడని గుర్తించిన ఉమేశ్ యాదవ్… తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అయితే, ఆ డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించాడు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బు తనకు ఇచ్చేలా చూడాలని కోరాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.