Usain Bolt: పరుగుల వీరుడు ఉసేన్ బోల్డ్ అకౌంట్ నుంచి 103కోట్లు మాయం..

ప్రపంచంలో ఫాస్టెస్ట్ రన్నర్లలో జమైకా రన్నర్ ఉసేన్ బోల్డ్ ఒకరు. ప్రస్తుతం అతను కోట్లాది రూపాయలను పోగొట్టుకున్నాడు. స్టాక్స్ అండ్ సెక్యూరిటీ లిమిటెడ్ సంస్థలో జరిగిన మోసంవల్ల తన సొమ్ము పోయింది. ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. దీనికితోడు కంపెనీ మేనేజ్ మెంట్ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వం అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు.

Usain Bolt: పరుగుల వీరుడు ఉసేన్ బోల్డ్ అకౌంట్ నుంచి 103కోట్లు మాయం..

Usain Bolt

Usain Bolt: ప్రపంచంలో ఫాస్టెస్ట్ రన్నర్లలో జమైకా రన్నర్ ఉసేన్ బోల్డ్ ఒకరు. 2008, 2012, 2016 సంవత్సరాల్లో ఒలింపిక్స్ పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించాడు. 2017లో అథ్లెటిక్స్ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు ఒక్కసారిగా పేదవాడిలా మారాడు. అతని సంపాదన, పదవీ విరమణ సొమ్ము డబ్బులన్నీ మాయమయ్యాయి. బోల్డ్ కు చెందిన సుమారు 103 కోట్లు సొమ్ము పోయింది.

పసిపాపకు పాలు కోసం.. Bolt కంటే వేగంగా రైలుతో పాటు పరిగెత్తిన పోలీస్

జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో కొన్నేళ్ల కిందట బోల్డ్ ఓ పెట్టుబడి ఖాతా తెరిచాడు. అందులో 12.8 మిలియన్ డాలర్లు ఉన్నాయి. అయితే.. గత వారం రోజుల క్రితం ఖాతాను చెక్ చేసుకోగా.. 103 కోట్లకుపైగా (12.7 మిలియన్ డాలర్లు) మోసపోయినట్లు గుర్తించాడు. కంపెనీలో జరిగిన మోసం వల్లనే తన డబ్బు మాయమైందని గుర్తించి బోల్డ్.. పదిరోజుల్లో ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేయాలని సూచించారు. మరోవైపు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బోల్డ్ న్యాయవాదులు కంపెనీని సూచించారు.

Tokyo Olympics: పసిడి పరుగుల ఎలైన్..వరుసగా 2 ఒలింపిక్స్‌లో 2 బంగారు పతకాలు..

ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. దీనికితోడు కంపెనీ మేనేజ్ మెంట్ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వం అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే భారీ మొత్తంలో మోసం జరిగినట్లు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తెలిపింది. ఇదంతా ఓ మాజీ ఉధ్యోగి వల్లననే గుర్తించామని, అయితే, బోల్డ్ తో పాటు మరికొందరి ప్రముఖుల సొమ్ముసైతం మాయమైనట్లు గుర్తించామని, రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని సంస్థ తెలిపింది.