పసిపాపకు పాలు కోసం.. Bolt కంటే వేగంగా రైలుతో పాటు పరిగెత్తిన పోలీస్

  • Published By: Subhan ,Published On : June 5, 2020 / 02:51 PM IST
పసిపాపకు పాలు కోసం.. Bolt కంటే వేగంగా రైలుతో పాటు పరిగెత్తిన పోలీస్

ఇండియన్ రైల్వే పోలీస్ ఉద్యోగి.. గ్రేట్ లెజెండ్ ఉస్సేన్ బోల్ట్‌ను దాటేశాడు. కదులుతున్న రైల్వే కోచ్‌లో ఉన్న చిన్నారి కోసం.. పాలు తీసుకుని రైలు కంటే వేగంగా పరిగెత్తాడు. అతని ప్రయత్నంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. దీనిపై మంత్రి పీయూశ్ గోయెల్ కూడా స్పందించారు. 

రైల్వే పోలీస్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్‌ ఇందర్ యాదవ్‌ను స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్ తో పోలుస్తూ ఇండియన్ రైల్వేస్ సంబంధించిన వీడియో పోస్టు చేశాడు. ‘ఓ చేత్తే రైఫిల్ మరో చేత్తే పాలు. ఇండియన్ రైల్వేస్ ఉస్సేన్ బోల్ట్‌ను వెనక్కుపడేశాయి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. 

రైల్వే పోలీసులను పొగుడుతూ.. మంత్రి చేసిన రెండో ట్వీట్ ఇది. ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను పోస్టు చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో పాటు ఆ పోలీస్‌కు క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు రైల్వే మంత్రి. 

షఫియా హష్మీ అనే మహిళ తన పాప కోసం కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లే మరికొంతసేపు ఆపాలని రైల్వే పోలీసులను కోరింది. భోపాల్ స్టేషన్‌లో కొద్ది నిమిషాల పాటు ఆగింది. తాను పాపకు పాలు పట్టించలేకపోయానని.. బిస్కట్లతోనే కడుపునింపాల్సి వస్తుందని చెప్పింది. 

ఆ మూడు నెలల చిన్నారి ఆకలి తీర్చేందుకు రైలు కదులుతుంటే యాదవ్ అనే రైల్వే పోలీసు.. పాలు అందించేందుకు మెరుపు వేగం అందుకున్నాడు. ఓ చేత్తే సర్వీస్ రైఫిల్ ను, మరో చేత్తే పాల ప్యాకెట్ ను పట్టుకుని పరిగెత్తాడు. లాంగ్ జర్నీలు చేసే శ్రామిక్ స్పెషల్ రైళ్లు వలస  కార్మికుల ఆహారం, నీరు కొరతల కారణంగా 8 నుంచి 10గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి.