Shardul Thakur Wedding: శార్దూల్ ఠాకూర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో టీమిండియా క్రికెటర్ల సందడి.. వీడియో వైరల్ ..

టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం వివాహం చేసుకున్నాడు. ముంబైలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Shardul Thakur

Shardul Thakur Wedding: టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం వివాహం చేసుకున్నాడు. ముంబైలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి కొద్దిరోజుల ముందునుంచే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో టీమిండియా ప్లేయర్ శ్రేయాష్ అయ్యర్ శార్దూల్ పటేల్‌తో కలిసి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Shardul Thakur Wedding

శ్రేయాస్ అయ్యర్ కేకేఆర్ టీం మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్‌తో కలిసి శార్దూల్ – మిథాలీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. స్టేజీపై నుంచి అభిషేక్ నాయక్, శార్దూల్ పాట పడుతుండగా మిథాలీతో కలిసి శార్దూల్ రొమాంటిక్ స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శార్దూల్ – మిథాలీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు.

 

శార్దూల్ ఠాకూర్ త్వరలో జరగబోయే ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ కంటే ముందే జరిగే ఆసీస్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లోకూడా శార్దూల్ సెలక్ట్ అయిన విషయం విధితమే.