Team India : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు భార‌త‌ జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా గిల్‌.. తొలిసారి చోటు ద‌క్కించుకున్న తెలుగు కుర్రాడు..

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌క‌టించింది.

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్ ల‌కు విశ్రాంతి నిచ్చారు. ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన ఆట‌గాళ్ల‌తో పాటు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఛాన్స్ ద‌క్కని ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారు. రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌రీలో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ ను కెప్టెన్‌గా నియ‌మించారు.

ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన‌ప్ప‌టికీ తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌ని య‌శ‌స్వి జైస్వాల్‌, సంజూ శాంస‌న్‌లు జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక అయ్యారు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శ‌ర్మ‌తో పాటు ఆల్‌రౌండ‌ర్ నితీశ్ రెడ్డి, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్‌లు తొలి సారి భార‌త జ‌ట్టులో చోటు సంపాదించారు.

Gautam Gambhir : రోహిత్, కోహ్లిల‌కు గంభీర్ చెక్‌..! బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్లు.. ఒకే చెప్పిన బోర్డు..!

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది.

టీమ్ఇండియా జ‌ట్టు : శుభ్‌మ‌న్ గిల్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

జింబాబ్వే ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

తొలి టీ20 – జూలై 6న‌
రెండ‌వ టీ20 – జూలై 7న‌
మూడ‌వ టీ20 – జూలై 10న‌
నాలుగో టీ20 – జూలై 13న‌
ఐదో టీ20 – జూలై 14న.

USA vs ENG : యువ‌రాజ్ సింగ్ సిక్స‌ర్ల రికార్డును కాపాడిన ఫిలిప్ సాల్ట్‌.. లేదంటేనా..?

ట్రెండింగ్ వార్తలు