USA vs ENG : యువరాజ్ సింగ్ సిక్సర్ల రికార్డును కాపాడిన ఫిలిప్ సాల్ట్.. లేదంటేనా..?
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తృటిలో ఈ రికార్డును మిస్ అయ్యాడు.

Buttler Smashes 5 Sixes Off Harmeet Singh During USA vs ENG
United States vs England : పొట్టి ప్రపంచకప్‌లో గ్రూపు దశలో తడబడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కీలకమైన సూపర్ 8లో అదరగొట్టింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమెరికా పై ఘన విజయం సాధించింది. తన నెట్ రన్‌రేటును ఘననీయంగా మెరుగుపరచుకుంది. తద్వారా సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మరో 62 బంతులు మిగిలి ఉండగా 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో అమెరికా మొదట బ్యాటింగ్ చేసింది. 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (24 బంతుల్లో 30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌జోర్డాన్ నాలుగు వికెట్లు తీయగా సామ్ కరన్, ఆదిల్ రషీద్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రీసీ టోప్లే ఓ వికెట్ సాధించాడు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సౌతాఫ్రికా
స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా జోస్ బట్లర్ (83 నాటౌట్; 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఫిలిప్ సాల్ట్ (25నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. దీంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అందుకుంది.
యువీ రికార్డు జస్ట్ మిస్..
2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆరంభ ఎడిషన్‌లో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ అన్ని బంతులను సిక్సర్లుగా మలిచాడు. తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తృటిలో ఈ రికార్డును మిస్ అయ్యాడు.
అమెరికా పేసర్ హర్మీత్ సింగ్ వేసిన 8వ ఓవర్‌లో బట్లర్ పెను విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. మొదటి బంతికి ఫిలిప్ సాల్ట్ సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్‌కు వచ్చిన బట్లర్ వరుసగా నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో హర్మీత్ సింగ్ ఒత్తికి లోనై ఓ వైడ్ వేశాడు. కనీసం ఆఖరి బంతిని కూడా బట్లర్ వదిలిపెట్టలేదు. భారీ సిక్స్‌గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 32 పరుగులు వచ్చాయి. మొదటి బంతి ఫిలిప్ సాల్ట్ ఆడబట్టి సరిపోయింది కానీ.. బట్లర్ ఫామ్ చూస్తే యూవీ సిక్సర్ల రికార్డును బట్లర్ సమం చేసేవాడే.
WI vs SA : దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ కాదు భయ్యా..
View this post on Instagram