చుట్టేశారు: కివీస్‌ను కట్టడి చేసిన భారత్, టార్గెట్ 159

భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ జట్టును ఆరంభం నుంచి కట్టడి చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు తీసి 158 పరుగులకు కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసి పతనాన్ని ఆరంభించగా
కృనాల్ పాండ్యా వరుసగా రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి వేగం పెంచాడు. ఆ తర్వాత ఓవర్లలో హార్దిక్ పాండ్యా 1, ఖలీల్ అహ్మద్ 2లతో ఇన్నింగ్స్‌ను ముగించారు.
కివీస్ బ్యాటింగ్‌లో గ్రాండ్ హోమ్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరు ఇచ్చాడు.