నిద్రలోనే: 10 మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు సజీవ దహనం

నిద్రలోనే: 10 మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు సజీవ దహనం

Updated On : February 9, 2019 / 8:31 AM IST

ఫుట్‌బాల్‌కు అమితాదరణ ఉన్న బ్రెజిల్‌లో పది మంది ప్లేయర్లు సజీవదహనమైన ఘటన చోటు చేసుకుంది. ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రదేశంలో మంటలు వ్యాపించడంతో వారంతా అప్రమత్తమయ్యేలోపే ప్రాణాలు కోల్పోయారు. రియో డి జనీరో ప్రాంతంలోని ట్రైనింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో జరగడంతో అప్రమత్తమయ్యలోపే అంతా జరిగిపోయింది. వీరంతా ప్లెమింగ్ క్లబ్‌కు చెందిన ప్లేయర్లుగా గుర్తించారు. 

రెండు నెలల క్రితమే ప్రారంభించిన నిన్హో డు ఉరుబు ట్రైనింగ్ సెంటర్‌‌లో టీనేజీ ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. యూత్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ టీనేజర్లంతా శిక్షణ తీసుకుంటున్నారు. 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్కులైన వీరు చురుకుగా ఈవెంట్లలో పాల్గొనేవారిని శిక్షకులు తెలిపారు.

అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనలో పది మంది సజీవ దహనంగ కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటగాళ్లు నిద్రించిన ప్రదేశం మంటలకు పూర్తిగా అనుకూలంగా ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. మంటల ధాటికి గది రేకుల కప్పు పూర్తిగా కాలిపోయింది. 123 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫ్లెమింగ్ ఫుట్‌బాల్ క్లబ్‌‌లో ఇటువంటి ఘటన జరగడం చాలా విషాదకరం అని క్లబ్ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.