Sunil Gavaskar: సిరాజ్ 6 వికెట్లు తీస్తే.. కపిల్ దేవ్‌కు థ్యాంక్స్ చెప్పాడేంటీ ఈ గవాస్కర్?

‘నేను ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను.. కపిల్ జన్మదినం అయిన జనవరి 6న భారత్ ఏదైనా ఓ మ్యాచ్ గెలుస్తుంది’ అని గవాస్కర్ చెప్పారు. కాగా, కపిల్ 1959, జనవరి 6న జన్మించారు.

Sunil Gavaskar: సిరాజ్ 6 వికెట్లు తీస్తే.. కపిల్ దేవ్‌కు థ్యాంక్స్ చెప్పాడేంటీ ఈ గవాస్కర్?

Gavaskar

Updated On : January 3, 2024 / 7:52 PM IST

సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత ఫాస్ట్ బౌలర్లు 55 పరుగులకే ఆలౌట్ చేయడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి క్రికెట్ అభిమానుల దృష్టిని మరోసారి తనవైపునకు తిప్పుకున్నాడు.

రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్లే అన్ని వికెట్లు పడగొట్టారు. సిరాజ్ 6 వికెట్లు తీయడంపై, ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ… టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు థ్యాంక్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కపిల్ దేవ్‌కు కృతజ్ఞతలు. ఇండియాకు కపిల్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు.. స్పిన్ బౌలర్‌ను జట్టులోకి కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని కపిల్ అప్పట్లోనే నిరూపించారు. భారత్‌లోని పిచ్‌లపై కూడా ఈ విధంగా వికెట్లు తీయొచ్చు. సౌతాఫ్రికా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల పర్యటనల సమయంలో ఫాస్ట్ బౌలర్ల నుంచి జట్టుకు మరింత లాభం చేకూరుతుంది.

భారత్ అనేక మంది సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్లను తయారు చేసుకుంది. ముఖ్యంగా గత 10-12 ఏళ్లలో ఐపీఎల్ వల్ల చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ముందుకు వచ్చారు. క్రికెట్ ప్రపంచమే అసూయ పడేంత మంది సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్లు ఇప్పుడు భారత్‌లో ఉన్నారు.

బుమ్రాలేని సమయంలోనూ భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారో చూశాం. ముఖ్యంగా మొహమ్మద్ షమీ. ఈ ఘనత అంతా కపిల్ దేవ్‌కే దక్కుతుంది. నేను ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను.. కపిల్ జన్మదినం అయిన జనవరి 6న భారత్ ఏదైనా ఓ మ్యాచ్ గెలుస్తుంది’ అని గవాస్కర్ చెప్పారు. కాగా, కపిల్ 1959, జనవరి 6న జన్మించారు.

ఆరుగురు డకౌట్.. 153 పరుగులకు కుప్పకూలిన టీమిండియా