Rohit Sharma : రోహిత్ శ‌ర్మ జిమ్ వీడియో వైర‌ల్‌.. 99 శాతం వ‌ర్కౌట్లు.. 1 శాతం మాత్రం..

బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సిద్ధం అవుతున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ జిమ్ వీడియో వైర‌ల్‌.. 99 శాతం వ‌ర్కౌట్లు.. 1 శాతం మాత్రం..

That 1 Per Cent Rohit Sharma Joins Viral Trend

స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సిద్ధం అవుతున్నాడు. ఈ క్ర‌మంలో జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఓ వీడియోను అత‌డు షేర్ చేశాడు. ఇందులో వ్యాయామ స‌మ‌యంలో 99 శాతం క‌ష్ట‌ప‌డుతాన‌ని, మిగిలిన ఒక్క శాతం మాత్రం త‌న చేష్ట‌ల‌తో స‌హ‌చ‌రుల‌ను ఇబ్బంది పెడ‌తాన‌ని హిట్‌మ్యాన్ తెలిపారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శ‌ర్మ వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ నాయ‌త‌క్వంలో బ‌రిలోకి దిగింది. అయితే.. వ‌న్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. లంక ప‌ర్య‌ట‌న త‌రువాత బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు 40 రోజుల పాటు సుదీర్ఘ విరామం ల‌భించింది. ఈ విరామంలో రోహిత్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డిపాడు.

Paralympics 2024 : పారా అథ్లెట్ల‌పై కాసుల వ‌ర్షం..

ఇక బంగ్లాతో సిరీస్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఇందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాడు. జిమ్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ‘వన్‌ పర్సెంట్‌’ ట్రెండ్‌కు అనుగుణంగా తన వీడియోను షేర్‌ చేశాడు. వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో.. కాస్త విరామం దొరకగానే తన ట్రెయినీలు, స్నేహితులను రోహిత్ టీజ్‌ చేయడం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్ప‌టికే టెస్టు జ‌ట్టును ప్ర‌క‌టించింది. రిష‌బ్ పంత్ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. కేఎల్ రాహుల్‌, బుమ్రా, కోహ్లీలు తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్నారు.

Saina Nehwal : విమ‌ర్శ‌కుల‌కు సైనా కౌంట‌ర్.. ‘ముందు ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించండి..’

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు టీమ్ఇండియా..
రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా, అక్ష‌ర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మ‌హ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, యాష్ దయాల్.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)