Paralympics 2024 : పారా అథ్లెట్ల‌పై కాసుల వ‌ర్షం..

పారిస్ వేదిక‌గా జ‌రిగిన పారాలింపిక్స్‌లో భార‌త పారా అథ్లెట్లు అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

Paralympics 2024 : పారా అథ్లెట్ల‌పై కాసుల వ‌ర్షం..

Huge Cash Prize For Paralympics Medallists

Paralympics Medallists : పారిస్ వేదిక‌గా జ‌రిగిన పారాలింపిక్స్‌లో భార‌త పారా అథ్లెట్లు అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేశారు. రికార్డు స్థాయిలో 29 ప‌త‌కాల‌ను సొంతం చేసుకున్నారు. ఇందులో 7 స్వ‌ర్ణ‌, 9 ర‌జ‌త, 13 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ 18వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పారా అథ్లెట్ల‌పై కాసుల వ‌ర్షం కురుస్తోంది.

విశ్వ క్రీడ‌ల్లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన ఏడుగురికి త‌లా రూ.75 ల‌క్ష‌లు ఇస్తామ‌ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండ‌వీయ తెలిపారు. ర‌త‌జ ప‌త‌కం గెలిచిన వారికి రూ.50ల‌క్ష‌లు, కాంస్య ప‌త‌కం సాధించిన అథ్లెట్ల‌కు రూ.30ల‌క్ష‌ల చొప్పున న‌గ‌దు పుర‌స్కారాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Saina Nehwal : విమ‌ర్శ‌కుల‌కు సైనా కౌంట‌ర్.. ‘ముందు ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించండి..’

ఇక మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ప‌త‌కంతో స‌త్తా చాటిన వాళ్ల‌కు రూ.22.5 ల‌క్ష‌ల న‌గ‌దు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. విశ్వ క్రీడ‌ల్లో ప‌త‌క విజేత‌ల‌కు ఏర్పాటు చేసిన స‌న్మాక కార్య‌క్ర‌మంలో మంత్రి ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. 2028లో లాస్ ఏంజెల్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న పారాలింపిక్స్‌లో అథ్లెట్లు మ‌రిన్ని ప‌త‌కాల‌ను గెల‌వాల‌ని ఆకాంక్షించారు. ఇందుకు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు.

పారాలింపిక్స్ ఆఖ‌రి రోజు జ‌రిగిన జావెలిన్ త్రోలో న‌వ్‌దీప్ సింగ్ ప‌సిడి ప‌త‌కాన్ని సాధించాడు. దీంతో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 29కి చేరింది. ఈ సంద‌ర్భంగా న‌వ‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘నా కోసం నా కోచ్ నావ‌ల్ సింగ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఏడు సంవ‌త్స‌రాల పాటు నాకు శిక్ష‌ణ ఇచ్చాడు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కార‌ణం ఆయ‌నే.’ అని చెప్పాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. ష‌మీ, శ్రేయ‌స్‌కు నో ఛాన్స్‌.. ఎందుకంటే..?