కోహ్లీ.. సమ్మర్ లో చూసుకుందాం: షేన్ వార్న్

కోహ్లీ.. సమ్మర్ లో చూసుకుందాం: షేన్ వార్న్

Updated On : November 23, 2019 / 1:04 PM IST

బీసీసీఐ డే అండ్ నైట్ టెస్టులకు ఆమోదం తెలియజేయడంతో టీమిండియా పింక్ బాల్ పట్టింది. బంగ్లాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దూకుడు సాధిస్తోన్న భారత్ సత్తా చాటుతోంది. ఈ మేర గంగూలీ చేసిన ట్వీట్‌కు బదులిచ్చిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఇలా ట్వీట్ చేశాడు. 

‘డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు విరాట్ కోహ్లీ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. వచ్చే సమ్మర్లో భారత్.. ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో చూసుకుందాం. ఈ పర్యటన చాలా అద్భుతంగా ఉందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. 

భారత పర్యటనలో భాగంగా ఆడుతోన్న బంగ్లాదేశ్‌పై టీమిండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ను 106పరుగులతో ముగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది. ఫలితంగా ఆరంభంలోనే 4వికెట్లు కోల్పోగా ముష్ఫికర్ రహీమ్, మొహమ్మదుల్లాలు క్రీజులో నిలిచేందుకు కష్టపడుతున్నారు.