Hardik Pandya Trolls: హార్ధిక్ మరీ ఇంత స్వార్థమా.. తిలక్ వర్మ ఆఫ్ సెంచరీ మిస్.. కెప్టెన్‌పై మండిపడుతున్న నెటిజన్లు
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. అలా సిక్స్ కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు.

Tilak Varma and Hardik Pandya
Tilak Varma: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఇండియా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయ సాధిస్తేనే సిరీస్ కైవసం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (83 పరుగులు 44 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా తిలక్ వర్మ(49 నాటౌట్; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్ ) సమయోచితంగా రాణించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Tilak Varma and Hardik Pandya
హార్డిక్ తీరుపై నెటిజన్ల విమర్శలు..
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. అలా సిక్స్ కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉంది. భారత్ విజయానికి 14 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో హార్డిక్ పాండ్యా స్ట్రైక్‌లో ఉన్నాడు. నాన్‌స్ట్రైక్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ అప్పటికే 49 పరుగులు చేశాడు. మరొక్క పరుగు చేస్తే ఆఫ్ సెంచరీ అయ్యేది. మ్యాచ్ చూస్తున్న ప్రతిఒక్కరూ హార్దిక్ పాండ్యా సింగిల్ తీసి తిలక్ వర్మకు స్ట్రైక్ ఇస్తారని భావించారు. కానీ, హార్ధిక్ ఏకంగా సిక్స్ కొట్టేసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఫలితంగా తిలక్ వర్మ అవకాశం ఉన్నప్పటికీ ఆఫ్‌సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో క్రీడాభిమానులు హార్డిక్ పాండ్యాపై మండిపడుతున్నారు.
https://twitter.com/lexicopedia1/status/1688986900101730310?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1688986900101730310%7Ctwgr%5E39323718d78bc3bf5175c519c58edfbc705f94f0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fwest-indies-vs-india-2023%2Fhardik-pandyas-selfish-act-denies-tilak-varma-fifty-skipper-faces-heat-on-twitter-watch-4281710
ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకో..
హార్డిక్ పాండ్యా ప్లేస్‌లో ధోనీ, కోహ్లీ, రోహిత్ లాంటి కెప్టెన్లు క్రీజులో ఉంటే తిలక్ వర్మకు స్ట్రైక్ ఇచ్చి ఆఫ్ సెంచరీ పూర్తిచేసే అవకాశం కల్పించేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా ఇప్పటికైనా ఆ ముగ్గురు కెప్టెన్లను చూసి నేర్చుకోవాలని, సహచర, యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సిరీస్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేసిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీకి కొద్దిదూరంలో మిస్ కాగా, రెండో మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ చేసి టీ20ల్లో తొలి ఆఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మూడో మ్యాచ్‌లో 49 పరుగులతో నాటౌట్‌గా తిలక్ వర్మ నిలిచాడు.
https://twitter.com/katyxkohli17/status/1688971640343056389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1688971640343056389%7Ctwgr%5E39323718d78bc3bf5175c519c58edfbc705f94f0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fwest-indies-vs-india-2023%2Fhardik-pandyas-selfish-act-denies-tilak-varma-fifty-skipper-faces-heat-on-twitter-watch-4281710
https://twitter.com/AviRaaz20/status/1688996885816905728?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1688996885816905728%7Ctwgr%5E39323718d78bc3bf5175c519c58edfbc705f94f0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fwest-indies-vs-india-2023%2Fhardik-pandyas-selfish-act-denies-tilak-varma-fifty-skipper-faces-heat-on-twitter-watch-4281710