NZ vs PAK : పాక్ బౌలర్ ని పిచ్చకొట్టుడు కొట్టిన కివీస్ బ్యాటర్.. ఒక ఓవర్ లో 6,6,0,2,6,6

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వ‌రుస‌గా రెండో టీ20లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది.

Tim Seifert makes Shaheen Afridi look ordinary with 4 sixes in an over

గ‌త కొన్నాళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు ఏదీ క‌లిసిరావ‌డం లేదు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఒక్క మ్యాచ్‌లో గెల‌వ‌కుండానే గ్రూప్ స్టేజీ నుంచే ఇంటి ముఖం ప‌ట్టింది. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో వ‌రుస‌గా రెండో టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టు పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం పాకిస్తాన్‌, న్యూజిలాండ్ జ‌ట్లు రెండో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. వ‌ర్షం ఆటంకం క‌లిగించిన ఈ మ్యాచ్‌ను 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 15 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. కెప్టెన్ స‌ల్మాన్ ఆఘా 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 46 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

Most wickets in an IPL match : ఐపీఎల్ బౌలింగ్ లో తోపులు.. ఒక్క మ్యాచ్ లోనే 5,6 వికెట్లు పడగొట్టిన బౌలర్స్ వీళ్లే..

షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 26 ప‌రుగులు చేశాడు. ఆఖ‌రిలో షాహీన్ అఫ్రిది 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫ్పీ, బెన్ సీర్స్, నీషమ్ ఇష్ సోదీ తలో రెండు వికెట్లు తీశారు.

ఆ త‌రువాత ఓపెన‌ర్లు టీమ్ సీఫ‌ర్ట్ (45; 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ఫిన్ అలెన్ (38; 16 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ 13.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బౌలర్లలో హ్యారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయ‌గా, మహ్మద్ అలీ, ఖుష్దిల్ షాన్, జహ్నాద్ ఖాన్ త‌లా ఓ వికెట్ సాధించారు. ఈ విజ‌యంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

Most fours in IPL : బౌండరీల బాహుబలి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్లు.. టాప్ 10లో 8 మంది మనోళ్లే.. హయ్యస్ట్ ఎవరో చూస్తే

ష‌హీన్ అఫ్రీది ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు..

కివీస్ ఓవ‌ర్ టీమ్ సీఫ‌ర్ట్ పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో దంచికొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌ను షాహీన్ వేయ‌గా.. తొలి బంతిని బౌల‌ర్ త‌ల‌పై నుంచి సిక్స్‌గా మ‌లిచాడు. రెండో బంతిని క‌వ‌ర్ మీదుగా సిక్స్ బాదాడు.

PM Modi : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ పై న్యూజిలాండ్ ప్ర‌ధాని జోక్‌.. చిరు న‌వ్వులు చిందించిన భార‌త ప్ర‌ధాని మోదీ

మూడో బంతి డాట్ అయింది. నాలుగో బంతికి రెండు ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతిని మిడాన్ దిశ‌గా, ఆరో బంతిని షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ పై నుంచి సిక్స‌ర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర‌ల్‌లో .. 6,6,0,2,6,6 మొత్తంగా 26 ప‌రుగుల‌ను పిండుకున్నాడు టీమ్ సీఫ‌ర్ట్‌. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.