Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.

TNPL Ashwin Faces Explosive Ball Tampering Allegations
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) సందర్భంగా అశ్విన్ తో పాటు అతడి జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు మధురై పాంథర్స్ ఫిర్యాదు చేసింది.
జూన్ 14న దిండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దిండిగల్ డ్రాగ్స్ బంతిని బరువుగా చేయడానికి రసాయనాలు కలిపిన టవల్స్‌ను ఉపయోగించినట్లు మధురై పాంథర్స్ టీఎన్‌పీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. ట్యాంపరింగ్ కారణంగా బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు లోహ ధ్వని వినిపించిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో టీఎన్‌పీఎల్ నిర్వాహకులు ట్యాంపరింగ్‌కు సంబంధించిన ఏవైన ఆధారాలు సమర్పించాలని మధురై పాంథర్స్ ను కోరారు.
India U19 : ఇంగ్లాండ్‌తో సిరీస్.. టీమ్ఇండియాకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాలు..
దీనిపై టీఎన్‌పీఎల్ సీఈఓ ప్రసన్న కన్నన్ స్పందించారు. మధురై పాంథర్స్ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. వారి ఫిర్యాదును స్వీకరించినట్లుగా చెప్పారు. అయితే.. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరినట్లుగా తెలిపారు.
ఒకవేళ వారు చేసిన ఆరోపణల్లో ఏదైన నిజం ఉందని అనిపిస్తే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తగిన ఆధారాలు లేకుండా ఓ ఆటగాడు లేదా ఏదైన ఫ్రాంఛైజీపై ఆరోపణలు చేయడం తప్పన్నారు. ఒకవేళ మధురై ఫ్రాంచైజీ తగిన ఆధారాలు అందించకపోతే ఆంక్షలను ఎదుర్కొక తప్పదన్నారు.
ENG vs IND : మరో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భారత జట్టుకు శుభవార్త..
ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతి ఫ్రాంఛైజీకి టవల్స్‌ను ఇస్తోంది. వీటిని ఉపయోగించి బాల్ పై ఉన్న తడిని పొగొట్టుకోవచ్చు. కాగా.. బంతి సిక్స్‌గా వెళ్లినా, బ్యాటర్ ఔటైనా, ఓవర్ బ్రేక్ అయిన సమయాల్లో అంపైర్లు క్రమం తప్పకుండా బంతిని చెక్ చేస్తూనే ఉంటారు. ఆ మ్యాచ్ సమయంలో బంతిలో వారికి ఎటువంటి సమస్య కనిపించలేదని కన్నన్ అన్నారు.