Tokyo Olympics 2020: ఈ ఒలింపిక్ మెడల్స్‌ను కొరకలేరు

టోక్యో ఆర్గనైజర్లు ఈ సారి విజేతలకు అందించే మెడల్స్ విషయంలో ఇంటరెస్టింగ్ విషయాన్ని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌ల నుంచి తీసుకున్న విలువైన మెటల్ తో రెడీ చేయించినట్లు ట్వీట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.

Tokyo Olympics 2020: ఈ ఒలింపిక్ మెడల్స్‌ను కొరకలేరు

Olympic

Updated On : July 27, 2021 / 1:28 PM IST

Tokyo Olympics 2020: టోక్యో ఆర్గనైజర్లు ఈ సారి విజేతలకు అందించే మెడల్స్ విషయంలో ఇంటరెస్టింగ్ విషయాన్ని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌ల నుంచి తీసుకున్న విలువైన మెటల్ తో రెడీ చేయించినట్లు ట్వీట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.

గోల్డ్ మెడల్ గెలుచుకున్న అథ్లెట్ మెడల్ ను కొరుకుతున్నట్లుగా తీసిన పిక్చర్ పోస్టు చేసి.. మేం అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తున్నాం. టోక్యో 2020మెడల్స్ తినే పదార్థం కాదు. మా మెడల్స్ జపనీస్ పబ్లిక్ విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ డివైజ్ లను రీసైకిల్ చేసి తయారుచేశాం. అని ట్వీట్ చేసింది.

అందుకనే మరీవాటిని కొరకొద్దు. కానీ మీరు ఇంకా వాటిని కొరకాలనే అనుకుంటే నాలుకతో టేస్ట్ చేసి చూడండని చేసిన ట్వీట్ కు.. #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కాగా పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందనలతో ట్వీట్ చేస్తున్నారు.

‘తినడానికి చాలా తియ్యగా ఉంటాయని రాయగా.. మరో యూజర్..’మీ ట్వీట్ నాకు నవ్వు తెప్పిస్తుందని కామెంట్ చేశాడు. కఠినంగా శ్రమించి ఎట్టకేలకు గెలిచిన తర్వాత వచ్చిన మెడల్ బిస్కట్ లా కనిపిస్తుందంటూ మరో యూజర్ రాశాడు.

ఈ టోర్నీకి అవసరమైన 5వేల గోల్డ్, సిల్వర్, రాగి పతకాలను తయారుచేయడానికి ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2019వరకూ ఎలక్ట్రానిక్ డివైజ్ లను సేకరించి వాటిని రీసైకిల్ చేశారు. జపాన్ దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ప్రక్రియ ద్వారానే తయారుచేసిన పతకాలను అథ్లెట్లకు అందిస్తున్నారు.