Tokyo Olympics 2020: తొలి రౌండ్‌లో గెలిచిన మేరీ కోమ్.. తర్వాతి రౌండ్‌కు మనీకా

ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరోసారి విజయానికి చేరవయ్యారు.

Tokyo Olympics 2020: తొలి రౌండ్‌లో గెలిచిన మేరీ కోమ్.. తర్వాతి రౌండ్‌కు మనీకా

Mary Kom

Updated On : July 25, 2021 / 2:46 PM IST

Tokyo Olympics 2020: ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరోసారి విజయానికి చేరవయ్యారు. 51 కేజీల విభాగంలో పతకం దిశగా పయనిస్తూ.. డొమీనికన్ రిపబ్లిక్ మిగ్వేలినా హెర్నాండేజ్ గార్సియాతో పోరాడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

2012లోనే ఒలింపిక్ కాంస్య పతకం గెలుచుకున్న 38ఏళ్ల మేరీ.. జూనియర్ అయిన వయస్సులో తనకంటే 15ఏళ్ల చిన్న ప్రత్యర్థితో 4-1 తేడాతో పోరాడుతున్నారు.

ఈ గేమ్ లో కొన్ని బ్రిలియంట్ టాక్టిక్స్ అప్లై చేసి ధీటుగా రాణించారు. గేమ్ చివరి మూడు నిమిషాలు మరింత ఉత్కంఠగా సాగింది. డొమినికాకు చెందిన ప్రత్యర్థి కూడా మేరీకి.. గట్టిపోటీనే ఇచ్చారు. పొట్ట భాగంలో పంచ్ లు విసురుతూ.. పడగొట్టేందుకు ప్రయత్నించారు.

నలుగురి పిల్లలకు తల్లి అయిన మేరీకోమ్.. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాతో పోటీపడనున్నారు. ఈమె ఖాతాలో 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య పతకం ఉంది.

మనీకా బాత్రా – టేబుల్ టెన్నిస్
టోక్యో ఒలింపిక్స్ లో మనీకా బాత్రా శుభారంభాన్ని నమోదు చేశారు. 56నిమిషాల పాటు సాగిన ఈ పోరాటంలో.. ఉక్రెయిన్ కు చెందిన మార్గరీటా పెసోట్కవాను ఓడించి తర్వాతి రౌండ్ కు చేరుకున్నారు.