Aditi Ashok: 200వ ర్యాంకు నుంచి 4వ స్థానానికి దూసుకొచ్చిన గోల్ఫ్ ప్లేయర్ అదితి

ప్రపంచంలోని ఆటల్లో గోల్ఫ్‌ అంటే రిచెస్ట్ గేమ్.. ఇది దాదాపు విదేశీయులే బాగా ఆడతారంటూ టాక్. ఆ మాటలను.. ఊహాగానాలను బ్రేక్ చేస్తూ.. మెగా టోర్నీ అయిన ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌ వరకూ చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేశారు 23 ఏళ్ల అదితి.

Aditi Ashok: 200వ ర్యాంకు నుంచి 4వ స్థానానికి దూసుకొచ్చిన గోల్ఫ్ ప్లేయర్ అదితి

Golf Player

Updated On : August 7, 2021 / 2:53 PM IST

Aditi Ashok: ప్రపంచంలోని ఆటల్లో గోల్ఫ్‌ అంటే రిచెస్ట్ గేమ్.. ఇది దాదాపు విదేశీయులే బాగా ఆడతారంటూ టాక్. ఆ మాటలను.. ఊహాగానాలను బ్రేక్ చేస్తూ.. మెగా టోర్నీ అయిన ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌ వరకూ చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేశారు 23 ఏళ్ల అదితి. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అదితి.. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తీసుకొచ్చేంత ఆటతీరు కనబరచింది.

మహిళా గోల్ఫ్‌ ర్యాకింగ్స్‌లో 200వ ర్యాంక్ లో ఉన్న అదితి.. టాప్ 2 వరకూ దూసుకొచ్చి.. చివరిగా ఆడిన మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కోట్ల మంది హృదయాలను గెల్చుకోగలిగింది.

బెంగళూరుకు చెందిన అదితి అశోక్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం పొజిషన్‌లో(మూడో రౌండ్‌) రెండో స్థానంలో నిలిచారు. అన్నీ కలసి వచ్చి ఉంటే దాదాపు పతకం ఖాయమయ్యేదే. శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్‌లో జరిగిన ఫైనల్‌ గేమ్‌ ఉత్కంఠను పెంచింది. అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది.

టాప్‌ పొజిషన్‌లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. చివరి మ్యాచ్ తర్వాత నాలుగో స్థానానికి సెటిల్‌ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్‌‌లోనూ మజా ఉందని కోట్ల మంది భారతీయులకు రుచి చూపించారు. రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించినా‌.. ప్రస్తుత సీజన్‌కు అనూహ్య రీతిలో ఫైనల్‌ వరకూ చేరుకోవడం విశేషం.

గోల్ఫ్‌ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి (క్యాడీ)గా తల్లి రాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగారు అదితి. ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్‌ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్‌(72), మోన్‌ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ ప్రపంచదేశాల క్రీడాభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్‌ వన్‌, మాజీ నెంబర్‌ వన్‌లకు సైతం ముచ్చెమటలు పోయించారు.