Wrestlers: అంతర్జాతీయ వేదికపై భారత్ తలెత్తుకునేలా చేశారు.. ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు
Wrestlers: రెజ్లర్లు మరో అడుగు వేశారు. విఘ్నేశ్ ఫొగాట్ (Vinesh Phogat) తో పాటు మరో ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Wrestlers
Wrestlers: అంతర్జాతీయ వేదికపై భారత్ తలెత్తుకునేలా చేసిన ఇండియన్ టాప్ రెజ్లర్లు ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh), ఇతర ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు ఎదురైన లైంగిక వేధింపులపై టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
తాము కొన్ని వారాల క్రితం ఆందోళనకు దిగినప్పటికీ న్యాయం జరగలేదని ఆదివారం నుంచి మళ్లీ వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఇక న్యాయం జరిగే వరకు వెనుదిరగబోమని రెజ్లర్లు స్పష్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ పోలీసు స్టేషనులో ఏడుగురు మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని విఘ్నేశ్ ఫొగట్ (Vinesh Phogat) తో పాటు మరో ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు రెజ్లర్ల తరఫున ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉంది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ప్రయోగించవచ్చని, ఈ కేసు ఇంత సీరియస్ గా ఉన్నప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పేర్కొన్నారు. రెజ్లర్లు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మధ్య మూడు నెలలుగా ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.
Beautiful tourist place : అక్కడ సెల్ఫీ క్లిక్ చేశారా అంతే .. భారీ మూల్యం తప్పదు